విదేశాల్లోని తెలుగువారికి కొండంత అండ: ప్రవాసాంధ్ర భరోసా బీమా
- May 28, 2018


అమరావతి: ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఆంధ్రులు తమ జన్మభూమిని, పుట్టిన ఊరిని మరిచిపోరని మరోసారి నిరూపించారు. అటువంటి నాన్ రెసిడెంట్ తెలుగు (ఎన్ఆర్‌టీ) వారి శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ఆలోచనల నుండి ఏర్పడిందే ఈ ఏపీఎన్ఆర్‍టీ. అమరావతి కేంద్రంగా 2016 మే నెలనుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సోసైటీ, ఇతర దేశాలలో ఉంటున్న తెలుగువారికి అనేక రకాల సేవలు అందిస్తోంది.
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినపుడు, విదేశీ ప్రభుత్వాల పాలసీలలో మార్పుల వల్ల ఎన్ఆర్‍టీలు ఇబ్బందులకు గురైనపుడు ఏపీఎన్ఆర్‍టీ వారికి అండగా నిలుస్తోంది. తాజాగా 2018 జనవరిలో కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష (అమ్నేస్టీ)ను మన రాష్ట్రానికి చెందిన వారు ఎంతోమంది సద్వినియోగం చేసుకోవటంలో ఏపీఎన్ఆర్‍టీ తీసుకున్న చోరవ ప్రపంచ వ్యాప్తంగా గల తెలుగువారి ప్రశంసలు అందుకుంది. వీటితో పాటు ఏపీఎన్ఆర్‍టీ తన వెబ్ సైట్ ద్వారా, హెల్ప్ లైన్ నంబరు +91 86323 40678 లేదా +91 8500027678 ద్వారా పలు ఇతర రకాల సేవలను కూడా అందిస్తోంది.
సేవే ప్రధానం...ప్రవాసాంధ్రులకు, ఏపీ ప్రభుత్వానికి వారధిలా..
ప్రపాసాంధ్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తూ, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టటానికి వెసులుబాటు కల్పిస్తున్న ఏపీఎన్ఆర్‍టీ ప్రవాసాంధ్రులకు అందిస్తున్న సేవలలో ప్రధానమైనది ఈ ప్రవాసాంధ్ర భరోసా భీమా.
మన రాష్ట్రంనుండి ప్రపంచంలోని అనేక దేశాలకు వలస వెళ్లిన తెలుగువారు, జీవనోపాధి కోసం రోజువారి కూలీ పనుల నుండి కోట్ల రూపాయలు సంపాదించే సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వరకు అనేక రంగాలలో నిలదొక్కుకున్నారు. అటువంటి వారి కోసం పది లక్షల రూపాయల వరకు ఉచిత భీమాను అందించే ఈ ప్రవాసాధ్ర భరోసా భీమా పధకానికి విశేష స్పందన లభిస్తోంది.
అవగాహన కార్యక్రమాలు/వేలమందికి ధీమా ఈ బీమా
ఇప్పటివరకు ఏపీఎన్ఆర్‍టీలో సభ్యత్వం పోందిన దాదాపు 70 వేలమందిలో, గడచిన నెల రోజులలోనే రెండున్నర వేలమంది ఈ భీమా పధకం కింద రిజిష్టర్ చేసుకున్నారు. మిగిలిన వారందరినీ కూడా ఈ భీమా ఛత్రం కిందకు తీసుకువచ్చి, వారి ఆరోగ్యానికి, జీవితానికి కూడా భరోసా అందించటానికి ఏపీఎన్ఆర్‍టీ డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్ అధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని కడప, చిత్తూరు, కృష్ణా లతోపాటు అనేక ఇతర జిల్లాలలో ఎన్ఆర్‍టీల కుటుంబసభ్యులకు ఈ భీమా పథకం పై అవగహనా కార్యక్రమాలు నిర్వహించింది.
ఈ భీమాను ప్రధానంగా ఉద్యోగులు, విద్యార్ధులు అనే రెండు వర్గాల వారిని లక్ష్యంగా చేసుకోని రూపోందించారు. ఈ రెండు వర్గాల వారు కూడా కేవలం నామమాత్రపు ప్రీమియం చెల్లించటం ద్వారా 10 లక్షల ప్రమాద భీమాను, అదేసమయంలో అనారోగ్యానికి గురైనపుడు 1 లక్ష రూపాయల వరకు చికిత్సకు కూడా పోందవచ్చు.
పధకం పోందటానికి అర్హతలు
1. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారై ఉండాలి
2. 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి
3. ఏపీఎన్ఆర్‍టీ సొసైటీ సభ్యత్వం కలిగి ఉండాలి.
పథకం పొందగోరు వారు అందించవలసిన వివరాలు:
1. సభ్యుని పేరు
2. పుట్టిన తేదీ
3. పాస్ పోర్టు నంబరు
4. వీసా వివరము
5. మోబైల్ నంబరు
6. పనిచేస్తున్న లేదా చదువుకుంటున్న సంస్ధ పేరు, చిరునామా
7. నామినీ పేరు, లబ్దిదారునికి నామినీతో గల సంబంధము
(భార్య, భర్త, కోడుకు, కూతురు, తల్లి, తండ్రి మాత్రమే అర్హులు)
ఉద్యోగులకు ఈ భీమా వల్ల కలిగే ప్రయోజనాలు:
బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యం కలిగి విదేశములో ఉద్యోగాన్ని కోల్పోయినట్లయితే 10 లక్షల రూపాయలు.
ప్రమాదం వలన మరణం సంభవించినప్పుడు లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినపుడు, మృతదేహాన్ని/అంగవైకల్యం కలిగిన వ్యక్తి మరియు ఒక సహాయకునికి స్వదేశానికి వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు. ప్రమాదం వలన సంభవించే గాయాలు/అస్వస్థత చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల క్రింద లక్ష రూపాయల చెల్లింపు. బీమా చేయబడిన వ్యక్తి అస్వస్థత కు గురై ఉద్యోగం చేయడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే ఆ వ్యక్తి మరియు ఒక సహాయకునికి స్వదేశం వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు.
బీమా చేయబడిన మహిళా ప్రవాసాంధ్రులు బీమా కాలపరిమితి లో సాధారణ ప్రసూతి ఖర్చుల క్రింద 35 వేల రూపాయలు లేదా సిజేరియన్ ఆపరేషన్ ఖర్చుల క్రింద 50వేల రూపాయలు.
బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన, వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చుల క్రింద బీమా కాలపరిమితి వరకు సంవత్సరానికి 50 వేల రూపాయలు. ఉద్యోగ సమయంలో కంపెనీ యాజమాన్యంతో ఏవేని సమస్యలు తలెత్తినట్లైతే, ఆ సమస్యల పరిష్కారానికి అయ్యే న్యాయ పరిష్కార ఖర్చుల క్రింద 45 వేల రూపాయలు.
విద్యార్ధులకు ఈ భీమా వల్ల కలిగే ప్రయోజనాలు:
బీమా చేయబడిన విద్యార్ధి విదేశాలలో ప్రమాదంలో మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన చో 10 లక్షల రూపాయలు. బీమా చేయబడిన విద్యార్ధి ప్రమాదం వలన మరణం సంభవించినప్పుడు లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినపుడు, మృతదేహాన్ని/అంగవైకల్యం కలిగిన వ్యక్తి, ఒక సహాయకునికి స్వదేశానికి వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు. విద్యార్ధికి ప్రమాదం వలన సంభవించే గాయాల చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల క్రింద లక్ష రూపాయల చెల్లింపు. బీమా చేయబడిన విద్యార్థి ప్రమాదమునకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే ఆ వ్యక్తి, ఒక సహాయకునికి స్వదేశం వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు.
బీమా సేవలు.. తెలుసుకోండిలా
ప్రతి ప్రవాసాంధ్రుడూ ఈ ఉచిత భీమా పథకాన్ని వినియోగించుకుని లబ్ది పోందలానే లక్ష్యంతో ఇప్పటికే ఎన్ఆర్‍టీ వైద్య సేవ పై ప్రజలకు అగాహన కల్పిస్తున్న సెర్ఫ్ సహకారంతో, గ్రామాలలోని భీమా మిత్రలు, వెలుగు సభ్యులు ఈ కార్యక్రమాన్ని గురించి ఎన్ఆర్‍టీల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, వారిని భీమా ఛత్రం కిందకు తీసుకు వస్తున్నామని ఏపీఎన్ఆర్‍టీ ప్రెసిడెంట్ డా. రవి వేమూరు తెలిపారు. తద్వారా లక్షలాదిమంది తెలుగు వారికి ఈ పధకం వర్తించేలా ఏపీఎన్ఆర్‍టీ కార్యక్రమాన్ని రూపోందించింది. విదేశాలలో ఉంటున్న తెలుగువారి బంధువులు తమ గ్రామాలలో గల వెలుగు గ్రామ సంఘాలను సంప్రదించి, ఈ క్రింది వివరాలు అందించి, భీమా ప్రీమియం చెల్లించటం ద్వారా భీమా పధకం కింద రిజిష్టర్ చేసుకోవచ్చు.
భీమాను క్లెయిమ్ చేసే విధానం కూడా ఎంతో సరళతరంగా ఉండేలా ఏపీఎన్ఆర్‍టీ విధి విధానాలను రూపోందించింది. ఏపీఎన్ఆర్‍టీ హెల్ప్‌లైన్ నంబర్లు
+91 86323 40678, +91 85000 27678కు ఫోన్ చేసి, భీమా వివరాలను అందిస్తే, వెంటనే అవసరమైన చర్యలు చేపడతారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







