నవంబర్‌లో బహ్రెయిన్‌లో అతి పెద్ద ఎయిర్ షో
- May 28, 2018
నవంబర్ 14 నుంచి 16 వరకు సాఖిర్ ఎయిర్ బేస్‌లో అతి పెద్ద ఎయిర్ షో జరగనుంది. బహ్రెయిన్‌లో నిర్వహించే ఈ అతి పెద్ద ఎయిర్ షో కోసం 95 శాతం స్లాట్స్ ఇప్పటికే బుక్ అయిపోయినట్లు ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ కమాల్ అహ్మద్ చెప్పారు. స్పేస్ రెంట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఎయిర్ షో 'జీరో నిర్వహణ'గా అభివర్ణించవచ్చని ఆయన వివరించారు. ఎయిర్ షోలను వరుసగా నిర్వహించడం ద్వారా బహ్రెయిన్ ఎకానమీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని చెప్పారు మినిస్టర్. హోటల్ రిజర్వేషన్స్, రెస్టారెంట్స్, రిటెయిల్ బిజినెస్ వంటి రంగాల్లో ఎయిర్ షో గణనీయ వృద్ధిని తీసుకు వస్తున్నట్లు మినిస్టర్ కమాల్ అహ్మద్ తెలిపారు. ఈసారి ఎయిర్ షోలో ప్రత్యేకంగా పిల్లల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నామనీ, అలాగే ఫ్యామిలీస్ కోసం కూడా పలు కార్యక్రమాలుంటాయని చెప్పారాయన.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..