యూఏఈలో 2018లో తొలి మెర్స్ కేసు
- May 28, 2018
కొత్త మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్ సిఓవి) పేషెంట్‌ని యూఏఈలో గుర్తించారు. 2018లో ఇదే తొలి కేసు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. బాధితుడు 78 ఏళ్ళ వ్యక్తి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలతో మే 13న ఆసుపత్రిలో చేరాడు బాధితుడు. ఇటీవలే సౌదీ అరేబియాకి వెళ్ళిన బాధితుడికి, యూఏఈలోని గయితిలో ఓ కామెల్ ఫామ్ కూడా వుంది. ప్రతిరోజూ ఆ ఫామ్‌ని సందర్శిస్తుంటారాయన. ప్రపంచ వ్యాప్తంగా 2,207 మెర్స్ సిఓవి కేసులు నమోదు కాగా, అందులో 787 మరనాలు నమోదయ్యాయి. సెప్టెంబర్ 2012 నుంచి ఈ వైరస్ మరణాల్ని లెక్కిస్తున్నారు. 2018లో ఇప్పటిదాకా మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. ఒమన్, మలేసియా, యూఏఈ నుంచి చెరో కేసు నమోదు కాగా, మిగతా కేసుల్ని సౌదీ అరేబియాలో గుర్తించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







