గీతా ఆర్ట్స్ బేనర్లో సాయి ధరమ్ తేజ్!

- May 29, 2018 , by Maagulf
గీతా ఆర్ట్స్ బేనర్లో సాయి ధరమ్ తేజ్!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 2014లో 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా ద్వారా తెరంగ్రటం చేశాడు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ సుప్రీం స్టార్ గీతా ఆర్ట్స్ బేనర్లో సినిమా చేయలేదు.

ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత గీతా ఆర్ట్స్ బేనర్లో తేజ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల 'ఛలో' సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

తమ ఫ్యామిలీకి చెందిన హీరోలను నిలబెట్టడంలో మెగా కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. మంచి కథ దొరకడం, అది సాయి ధరమ్ తేజ్ ఎనర్జీ లెవల్స్‌కు సూటయ్యే విధంగా ఉండటంతో నిర్మాత అల్లు అరవింద్ వెంటనే ఈ కాంబినేషన్ సెట్ చేశాడట.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే గీతా ఆర్ట్స్ ప్రాజెక్ట్ మొదలవుతుందని టాక్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com