9మంది పౌరులను కాల్చేసిన ఆఫ్ఘన్ సైన్యం

- May 29, 2018 , by Maagulf
9మంది పౌరులను కాల్చేసిన ఆఫ్ఘన్ సైన్యం

అఫ్గానిస్థాన్‌ భద్రతా సిబ్బంది 9 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. తూర్పు అఫ్గాన్‌ ప్రాంతంలో సోదాలు చేపట్టిన భద్రతా బలగాలు చేపట్టిన పొరపాటుగా జరిపిన కాల్పులలో 9 మంది మృతి చెందారు. వీరిలో స్థానిక పోలీసు కమాండర్‌ కూడా ఉన్నారు. చపార్‌హర్‌ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రావిన్స్‌ గవర్నర్‌ హయతుల్లా హయత్‌ చెప్పారు. ఈ కాల్పుల్లో మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com