గీతా ఆర్ట్స్ బేనర్లో సాయి ధరమ్ తేజ్!
- May 29, 2018
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 2014లో 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా ద్వారా తెరంగ్రటం చేశాడు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ సుప్రీం స్టార్ గీతా ఆర్ట్స్ బేనర్లో సినిమా చేయలేదు.
ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత గీతా ఆర్ట్స్ బేనర్లో తేజ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల 'ఛలో' సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.
తమ ఫ్యామిలీకి చెందిన హీరోలను నిలబెట్టడంలో మెగా కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. మంచి కథ దొరకడం, అది సాయి ధరమ్ తేజ్ ఎనర్జీ లెవల్స్‌కు సూటయ్యే విధంగా ఉండటంతో నిర్మాత అల్లు అరవింద్ వెంటనే ఈ కాంబినేషన్ సెట్ చేశాడట.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే గీతా ఆర్ట్స్ ప్రాజెక్ట్ మొదలవుతుందని టాక్.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్