షాప్‌ బహ్రెయిన్‌ రోడ్‌ షో ప్రారంభం

- December 08, 2015 , by Maagulf
షాప్‌ బహ్రెయిన్‌ రోడ్‌ షో ప్రారంభం

 

 

'షాప్‌ బహ్రెయిన్‌' జీసీసీ సిటీస్‌లో రోడ్‌ షో ప్రారంభించింది. షాప్‌ బహ్రెయిన్‌ ఫెస్టివల్‌కి ప్రచారం కల్పించేందుకు ఈ రోడ్‌ షోలను ప్లాన్‌ చేశారు. పలు ఈవెంట్స్‌ మరియు ట్రావెల్‌ ప్యాకేజీలు విజిటర్లు, మరియు టూరిస్టుల కోసం ఈ ఫెస్టివల్‌లో వేచి వున్నాయి. జెడా, దోహా మరియు కువైట్‌లో మూడు రోజులపాటు ఈ ప్రమోషనల్‌ కార్యక్రమాలుంటాయి. జిసిసి రోడ్‌ షోకి మీడియా ప్రతినిథుల నుంచి విశేష స్పందన లభించింది. 2014లో 6.6 మిలియన్‌ విజిటర్లను జిసిసి రీజియన్‌ నుంచి రప్పించగలిగామనీ, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువమంది విజిటర్స్‌ వస్తారని ఆశిస్తున్నట్లు షాప్‌ బహ్రెయిన్‌ డైరెక్టర్‌ నవాఫ్‌ అల్‌ కోహెజి చెప్పారు. రోడ్‌ షో ద్వారా'షాప్‌ బహ్రెయిన్‌'కి ప్రాచుర్యం కల్పించి, షాప్‌ బహ్రెయిన్‌ గురించి అందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నామనే తమ ప్రయత్నం విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. షాప్‌ బహ్రెయిన్‌ జాతీయ స్థాయి ఫెస్టివల్‌లా 30 రోజులపాటు జరగనుంది. 24డిసెంబర్‌ 2015 నుంచి 23 జనవరి వరకు జరిగే ఈ ఫెస్టివల్‌లో హెరిటేజ్‌, హాస్పిటాలిటీ మరియు టూరిజం విభాగాలు కంప్లీట్‌ ఫ్యామిలీని ఆకర్షించేలా పలు కార్యక్రమాలతో అలరిస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com