నిపా ఎఫెక్ట్‌: కేరళ నుంచి పండ్లు, కూరగాయలపై యూఏఈ నిషేధం

- May 29, 2018 , by Maagulf
నిపా ఎఫెక్ట్‌: కేరళ నుంచి పండ్లు, కూరగాయలపై యూఏఈ నిషేధం

యు.ఏ.ఈ:నిపా వైరస్‌ భయాందోళనల కారణంగా యూఏఈ, కేరళ నుంచి వచ్చే తాజా పండ్లు, కూరగాయలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. మినిస్ట్రీ ఆఫ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, స్థానిక ఫుడ్‌ అథారిటీస్‌కి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఎమిరేట్స్‌, కేరళ నుంచి వచ్చే తాజా కూరగాయలు, పండ్లపై నిషేధం వున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కేరళలో నిపా వైరస్‌ కారణంగా ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నిపా వైరస్‌కి ప్రధాన కారణంగా పండ్లను తినే రకం గబ్బిలాలని గుర్తించారు. మామిడి పండ్లు, డేట్స్‌, అరటిపండ్లు ఈ రకం గబ్బిలాలకు ఇష్టమైన ఆహారం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com