దోఫార్‌లో లోన్‌ పేబ్యాక్‌పై ఉపశమనం కల్పించిన సోహార్ బ్యాంక్

- May 29, 2018 , by Maagulf
దోఫార్‌లో లోన్‌ పేబ్యాక్‌పై ఉపశమనం కల్పించిన సోహార్ బ్యాంక్

మస్కట్‌:సైక్లోన్‌ మెకును కారణంగా దోఫార్‌లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టం కలగజేసింది సైక్లోన్‌ మెకును. ఈ కారణంగా దోఫార్‌ గవర్నరేట్ పరిధిలోని సోహార్ బ్యాంక్, తమ క్లయింట్లు చెల్లించాల్సిన లోన్‌ పేబ్యాక్‌పై కొంత ఉపశమనం కల్గించింది. వ్యక్తిగత, హౌసింగ్‌ మరియు ఆటో లోన్లకు సంబంధించి 2 నెలల సమయం పొడిగింపు ప్రకటించాయి బ్యాంకు సంబంధిత వర్గాలు. అయితే షరతులు వర్తిస్తాయని బ్యాంకు ప్రతినిథులు వివరించారు. ఇటీవల సంభవించిన సైక్లోన్‌ మెకును తీవ్ర నస్టాన్ని మిగిల్చిన సంగతి తెల్సిందే. ఈ తుపాను కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. తుపాను కారణంగా గల్లంతయినవారిలో కొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com