రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం

- May 29, 2018 , by Maagulf
రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం

హైదరాబాద్ : రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కేసులో మరో నిందితుడు వాకటి చంద్రశేఖర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ అవినాష్ మహం తి కథనం ప్రకారం.. ఈస్ట్రన్ రైల్వేస్, కోల్‌కత్తలో మినిస్టర్ కోటా కింద టిక్కెట్ కలెక్టర్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గ్యాంగ్‌మెన్ వంటి ఉద్యోగాలిప్పిస్తామని భాగవతుల లలితమ్మ, దుప్పట్ల శశిభూషణ్‌రావు, భగవతుల శ్రీనాథ్, వాకటి చంద్రశేఖర్ ముఠా మోసం చేసింది.

20 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 8 నుంచి రూ. 10 లక్షల వరకు సుమారు కోటి రూపాయలకుపైగా వసూలు చేసి, వారికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారు. దీనిపై బాధితుడైన పత్రుని రఘు, తదితరులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2015లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే లలితమ్మ, శశిభూషణ్‌రావు, శ్రీనాథ్‌లను అరెస్ట్ చేయగా చంద్రశేఖర్ బెంగళూర్‌కు పరారయి అజాతంలోకి వెళ్లిపోయాడు. కేఎన్ విజయ్‌కుమార్ బృందం ఎట్టకేలకు నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com