రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం
- May 29, 2018
హైదరాబాద్ : రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కేసులో మరో నిందితుడు వాకటి చంద్రశేఖర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ అవినాష్ మహం తి కథనం ప్రకారం.. ఈస్ట్రన్ రైల్వేస్, కోల్కత్తలో మినిస్టర్ కోటా కింద టిక్కెట్ కలెక్టర్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గ్యాంగ్‌మెన్ వంటి ఉద్యోగాలిప్పిస్తామని భాగవతుల లలితమ్మ, దుప్పట్ల శశిభూషణ్‌రావు, భగవతుల శ్రీనాథ్, వాకటి చంద్రశేఖర్ ముఠా మోసం చేసింది.
20 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 8 నుంచి రూ. 10 లక్షల వరకు సుమారు కోటి రూపాయలకుపైగా వసూలు చేసి, వారికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. దీనిపై బాధితుడైన పత్రుని రఘు, తదితరులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2015లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే లలితమ్మ, శశిభూషణ్‌రావు, శ్రీనాథ్‌లను అరెస్ట్ చేయగా చంద్రశేఖర్ బెంగళూర్‌కు పరారయి అజాతంలోకి వెళ్లిపోయాడు. కేఎన్ విజయ్‌కుమార్ బృందం ఎట్టకేలకు నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







