ఫుల్ జోష్‌లో ధోనీ సేన
- May 29, 2018చెన్నై సూపర్ కింగ్స్ విజయానందాన్ని ఎంజాయ్ చేస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో హైదరాబాద్ ను 8వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ - 2018 కప్‌ను కైవసం చేసుకుంది ధోనీ సేన. ఈ సందర్భంలో గ్రౌండ్ లోకి పరుగెత్తుకొచ్చింది ఓ చిన్నారి. ఆ చిన్నారి మరెవరోకాదు, ధోనీ కూతురు జివా. అంతలోనే భార్య సాక్షి కూడా స్టేడియంలోకి వచ్చి చిన్నారిని భుజాన వేసుకుని తన భర్తను దగ్గరకు తీసుకుని శుభాకాంక్షలు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీం ముంబై నుంచి తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ జర్నీలో మరిన్ని మజిలీలు ఆస్వాదించింది..
ఇదిలాఉంటే, ఐపీఎల్ 2018 విజేత ఎవరు కాబోతున్నారో వారం ముందే చెప్పిన ఏబీ డివిలియర్స్ మాటలు ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఐపీఎల్ 11వ సీజన్ ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్‌దే అని ముందే తేల్చిచెప్పేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్. ఓ నేషనల్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో డివిలియర్స్ వారం కిందటే విన్నర్ ఎవరనేది చెప్పాడు. 'ఐపీఎల్ ఫైనల్స్ ఏయే జట్ల మధ్య జరుగుతుందో చెప్పడం కష్టమని అయితే,ః మీరు ఏ జట్టు గెలుస్తుందో ఊహించమంటున్నారు కాబట్టి ఫైనల్స్‌లో చెన్నై-హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో ధోని తన మ్యాజిక్‌తో చెన్నై జట్టుని గెలిపిస్తాడు' అని అన్నాడు డెవిలియర్స్. అతని మాటలు నూటికి నూరు శాతం నిజం కావడం విశేషం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..