జాన్వి కపూర్ తొలి ఫోటో షూట్

- May 29, 2018 , by Maagulf

దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌. 'దఢక్' చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తున్న ఈ భామ ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్‌ వోగ్‌కు ఇంటర్వ్యూ, ఫొటోషూట్‌ ఇచ్చారు. గతంలో తల్లితో కలిసి చాలా ఫొటోషూట్లలో పాల్గొన్న జాన్వీ కథానాయికగా ఫొటోషూట్‌ ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ కు సంబధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. తొలి షూట్ అయినా ప్రొఫెషనల్ నటిగా చక్కగా పోజులు ఇచ్చిందని జాన్వి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com