బేబీ ఆయిల్ బ్రాండ్ రూమర్లపై స్పందించిన దుబాయ్ మునిసిపాలిటీ
- May 30, 2018
దుబాయ్:పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ - దుబాయ్ మునిసిపాలిటీ, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రూమర్లకు చెక్ పెట్టింది. అరిస్టోక్రాట్ బేబీ ఆయిల్‌తో అలర్జీలు వస్తున్నాయంటూ రూమర్లు వినవస్తున్నాయి. ఈ అంశంపై పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పందించింది. ఈ ప్రోడక్ట్ యూఏఈలో రిజిస్టర్ అయి లేదనీ, ఎక్కడా ఈ ప్రోడక్ట్‌కి సంబంధించిన ఆనవాళ్ళు లేవని పేర్కొంది. దుబాయ్‌లోగానీ, యూఏఈలో గానీ లేని ఈ ప్రాడక్ట్‌పై రూమర్స్‌లో అర్థం లేదని మునిసిపాలిటీ స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు దుబాయ్ మునిసిపాలిటీ, ఆయా ప్రాడక్ట్‌ల విషయమై తనిఖీలు నిర్వహిస్తుందనీ, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు తేల్చి చెప్పారు. వినియోగదారులెవరైనా తమకు అనుమానాలు కలిగితే, వెంటనే 'మాంతాజి' యాప్ ద్వారా ఫిర్యాదు చేయచ్చని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..