వాట్సాప్ కు పోటీగా రామ్ దేవ్ బాబా కింభో యాప్
- May 30, 2018
యోగా గురు రాందేవ్ బాబా స్వదేశీ ఉత్పత్తుల్లో తనదైన మార్క్ ను వేస్తున్నారు. ఇప్పటికే కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో నమ్మకమైన బ్రాండ్‌గా నిలదొక్కుకున్న పతంజలి ఇతర ఉత్పత్తులపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో స్వదేశీ సమృద్ది సిమ్ కార్డులను ఆవిష్కరించింది. పతంజలి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ సిమ్ లను అందుబాటులోకి తెచ్చినట్లు ఆసంస్థ ప్రతినిధులు తెలిపారు.
వారికి 2జీబీ డాటా, అపరిమిత కాలింగ్ ప్లాన్లను అందజేస్తారు. మరి సామాన్యులకు అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది అనే విషయం తెలియాల్సింది. ప్రస్తుతం పతంజలి సంస్థ ఉద్యోగులకు అందుబాటులోకి రానుండగా.. ఈ సిమ్ కార్డును కొనుగోలు చేసిన వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై కూడా 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రూ.144 రీచార్జ్‌తో అపరిమితసేపలు పొందచ్చు.
తాజాగా వాట్సాప్‌ను ఢీకొట్టేందుకు పతంజలి సిద్ధమైంది. కింభో పేరుతో సరికొత్త మెసేజింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ వాట్సాప్ కు పోటీగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..