దుబాయ్ లో వేలానికి శ్రీదేవి పెయింటింగ్స్
- May 30, 2018
అతిలోక సుందరి శ్రీదేవి అనంతలోకాలకేగి మూడు నెలలు కావస్తున్నా..తన జ్ణాపకాలు మాత్రం మనల్ని వదిలిపోవడం లేదు..ఎలా పోతాయి..మూడు దశాబ్దాల పాటు,రెండు తరాల నటులతో నాలుగు తరాల పాత్రలు పోషించిన శ్రీదేవి ఆ కాలం వారికి,ఈ కాలం వారికి కూడా సుపరిచితమే.తెలుగు పరిశ్రమ నుండి వెళ్లి బాలివుడ్ సూపర్ స్టార్ గా ఎదగడం అంటే మాటలు కాదు.శ్రీదేవికి తెలిసిందే కేవలం నటన మాత్రమే అనుకుంటే పొరపాటు.ఆమెలో మనకు తెలియని మరో కోణం ఉంది.ఆమె అద్బుతమైన పెయింటర్..
తెలుగు ,తమిళ,మళయాలం,కన్నడ ఇలా దక్షిణాదిన ఎన్నో సినిమాల్లో నటించి,ఉత్తరాధికి వెళ్లిన నటి శ్రీదేవి.అక్కడ తన సినిమాలతో ఆకట్టుకుని దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని సూపర్ స్టార్ గా ఎదిగింది.ఆ తర్వాత ప్రోడ్యూసర్ బోణి కపూర్ ని పెళ్లి చేసుకుని,ఇద్దరు పిల్లల తల్లిగా గృహిణి బాద్యతలు నిర్వర్తించింది.ఒక తల్లి తన పిల్లలకు దగ్గరుండి ఎలా చూసుకోవాలో వాటన్నింటిని శ్రీదేవి తన కెరీర్ పక్కన పెట్టి సైతం చేసింది.సినిమా షూటింగ్ గ్యాప్లో,పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు ,ఖాళీ సమయాల్లో శ్రీదేవి తన చేతికి పని పెట్టి ,కుంచె పట్టి అద్భుతమైన చిత్రాలను వేసేదట.అలా వేసిన వాటిల్లో మైఖేల్ జాక్సన్,సోనమ్ కపూర్ పెయింటింగ్స్ నువేసింది..సావరియా సినిమా టైంలో సోనమ్ స్టైల్ నచ్చి సోనమ్ పెయింట్ వేసింది..
తను వేసిన వాటిల్లో మైఖేల్ జాక్సన్ పెయింటింగ్ శ్రీదేవికి ఎంతో ఇష్టమట.గతంలోనే ఈ పెయింటింగ్ ని అమ్మకానికి పెట్టమని ఒక సంస్థ సంప్రదిస్తే కుదరదని చెప్పిందట.అమ్మగా వచ్చిన డబ్బుని చారిటికి ఉపయోగిస్తామని చెప్పడంతో సరే అన్నదట శ్రీదేవి.ఇప్పుడు మైకేల్ ,సోనమ్ ల పెయింటింగ్స్ ని దుబాయ్ లో వేలానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది సదరు సంస్థ. మైకేల్ జాక్సన్ పెయింటింగ్ కనీస ధరను 8 లక్షలుగా నిర్ణయించారు. ఈ పెయింటింగ్స్ ని సొంతం చేసుకోవడానికి ఎంత డబ్బు ఇవ్వటానికి అయినా చాలా మంది రెడీ అయ్యారట. శ్రీదేవి మనకు గొప్ప నటిగా మాత్రమే తెలుసు. కానీ ఆమెలో అనేక నైపుణ్యాలు దాగి ఉన్నాయి. నటనలో ఎక్కువ కాలం ఉండడం వల్ల శ్రీదేవితో ఉన్న మిగతా నైపుణ్యాలు బయటకు రాలేదనే చెప్పాలి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







