వాట్సాప్ కు పోటీగా రామ్ దేవ్ బాబా కింభో యాప్

- May 30, 2018 , by Maagulf
వాట్సాప్ కు పోటీగా రామ్ దేవ్ బాబా కింభో యాప్

యోగా గురు రాందేవ్ బాబా స్వదేశీ ఉత్పత్తుల్లో తనదైన మార్క్ ను వేస్తున్నారు. ఇప్పటికే కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో నమ్మకమైన బ్రాండ్‌గా నిలదొక్కుకున్న పతంజలి ఇతర ఉత్పత్తులపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో స్వదేశీ సమృద్ది సిమ్ కార్డులను ఆవిష్కరించింది. పతంజలి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ సిమ్ లను అందుబాటులోకి తెచ్చినట్లు ఆసంస్థ ప్రతినిధులు తెలిపారు.

వారికి 2జీబీ డాటా, అపరిమిత కాలింగ్ ప్లాన్లను అందజేస్తారు. మరి సామాన్యులకు అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది అనే విషయం తెలియాల్సింది. ప్రస్తుతం పతంజలి సంస్థ ఉద్యోగులకు అందుబాటులోకి రానుండగా.. ఈ సిమ్ కార్డును కొనుగోలు చేసిన వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై కూడా 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రూ.144 రీచార్జ్‌తో అపరిమితసేపలు పొందచ్చు.
 
తాజాగా వాట్సాప్‌ను ఢీకొట్టేందుకు పతంజలి సిద్ధమైంది. కింభో పేరుతో సరికొత్త మెసేజింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ వాట్సాప్ కు పోటీగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com