రకుల్ రిక్వెస్ట్ కు షాక్ అయిన బాలయ్య !
- May 30, 2018
నందమూరి సింహం బాలకృష్ణకు రకుల్ ప్రీత్ ఊహించని షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 'స్పైడర్' ఘోర పరాజయం తరువాత తెలుగు సినిమాలలో ఒక్క అవకాశం కూడ రాని రకుల్ కోలీవుడ్ లో బిజీగా ఉన్నా తెలుగు సినిమాల పై తన పట్టును కొనసాగించడానికి బాలయ్యను ఒక ఆయుధంగా మార్చుకోవడానికి ఊహించని ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు రకుల్ స్వయంగా ఈమధ్య బాలకృష్ణను కలిసి ఎన్టీఆర్ బయోపిక్ లో తనకు ఒకపాత్ర ఇమ్మని అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. అనుకోని ఈపరిణామానికి షాక్ అయిన బాలయ్య రకుల్ కోరిక తీరుస్తానని మాట ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈమూవీలో ఎన్టీఆర్ సతీమణి పాత్రకు నిత్యామీనన్ ఎంపిక అయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో బాలకృష్ణ రకుల్ కు ఈమూవీలో ఏపాత్ర ఇస్తాడు అన్నది ప్రస్తుతానికి ఎవరి ఊహలకు అందని విషయం.
ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా క్రిష్ రంగంలోకి దిగిన ఈమూవీ గురించి మరొక ఆసక్తికర విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ఈమూవీకి పేరుకు సాయి కొర్రపాటి నిర్మాత అయినా ఫండింగ్ అంతా బాలకృష్ణదే అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. కేవలం వర్కింగ్ పార్టనర్ గా మాత్రమే సాయి కొర్రపాటి వ్యవహరిస్తాడని టాక్. అదేవిధంగా అందరి ఊహలు తలక్రిందులు చేస్తూ ఈ ప్రాజెక్ట్ లోకి దర్శకుడుగా వచ్చిన క్రిష్ బాలకృష్ణకు ఈమూవీ విషయమై కొన్ని స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం.
ఈబయోపిక్ దర్శకత్వంలో తనకు పూర్తి స్వేచ్చ కావాలని ప్రతి చిన్న విషయంలోనూ తాను బాలయ్య అదుపు ఆజ్ఞలలో ఉండలేనని బాలకృష్ణకు సున్నితంగా సూచించినట్లు టాక్. దీనికితోడు బాలకృష్ణ ఈమూవీలో క్రిష్ కు పారితోషికం ఇవ్వకుండా మూవీ బిజినెస్ లో వాటా ఇస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అల్లు అర్జున్ తో క్రిష్ ఒకసినిమా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నా బాలయ్య ఇచ్చిన ఆఫర్ అన్ని విధాలా క్రిష్ కు నచ్చడంతో ఇలా బాలయ్య వైపు యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రిష్ పై ఉన్న క్రేజ్ తో పాటు తెలుగుదేశం అధికారంలో ఉన్ననేపధ్యంలో ఈ బయోపిక్ కు అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు..
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్