సగం సంపదను డొనేట్‌ చేసిన యూఏఈ బిజినెస్‌మెన్‌

- June 01, 2018 , by Maagulf
సగం సంపదను డొనేట్‌ చేసిన యూఏఈ బిజినెస్‌మెన్‌

యూఏఈకి చెందిన ముగ్గురు హై ప్రొఫైల్‌ బిజినెస్‌మెన్‌, అలాగే 14 మంది ఫిలాంత్రపిస్ట్స్‌ తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్‌ చేయడానికి ముందుకొచ్చారు. బిల్‌ మరియు మిలిందా గేట్స్‌, వార్నర్‌ బఫెట్‌ 'గివింగ్‌ ప్లెడ్జ్‌' పేరుతో భారీ డొనేషన్లకు తెరలేపారు. ఈ నేపథ్యంలో వారు చూపిన బాటలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్‌ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే యూఏఈకి చెందిన వ్యాపారవేత్త, క్రిసెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సీఈఓ, క్రిసెంట్‌ పెట్రోలియం ప్రెసిడెంట్‌, బద్ర్‌ జాఫ్ర్‌, ఎన్‌ఎంసి హెల్త్‌ అండ్‌ యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ ఫౌండర్‌ బిఆర్‌ శెట్టి, విపిఎస్‌ హెల్త్‌ కేర్‌ ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ షంవీర్‌ వయాలి తదితరులు ఈ డొనేషన్‌ క్యాంప్‌లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇతరుల జీవితాల్లో ఆనందం చూడగలగడమే నిజమైన విజయరహస్యమని ఈ ప్రముఖులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com