షూటింగ్‌లో గాయ‌పడిన వరుణ్ ధావన్

షూటింగ్‌లో గాయ‌పడిన వరుణ్ ధావన్

ఆరుగురు ప్రముఖ తారలతో బాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మించబోతున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్‌, మాధురీ దీక్షిత్‌లతో పాటు యువ నాయకానాయికలు వ‌రుణ్ ధావ‌న్, ఆదిత్య రాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో కృతి స‌న‌న్ స్పెష‌ల్ సాంగ్‌లో మెరవనుంది. ‘కళంక్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి‘2 స్టేట్స్‌’ ఫేమ్‌ అభిషేక్‌వర్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబైలోని స్డూడియాలో వేసిన భారీ సెట్‌లో వ‌రుణ్ తేజ్‌పై సాంగ్ చిత్రీకరిస్తున్నారు మూవీ మేకర్స్. సాంగ్ షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో వ‌రుణ్ త‌న కోస్టార్‌పై డోర్ విసిరారు. అది అనుకోకుండా హీరో మోచేతికి త‌గిలింది. దీంతో విల‌విల‌లాడిన వరుణ్ కొద్ది సేపు షూటింగ్‌లో పాల్గొన‌లేదు. 

Back to Top