ఓవర్సీస్ లో సత్తా చాటిన.. ప్రిన్స్ మహేష్ బాబు
- June 03, 2018
2018 టాలీవుడ్ కు చాలా ఆశలు మోసుకు వచ్చింది. ప్రతి సినిమా హిట్ కావాలన్నదే ఆ ఆశ. అది పూర్తిగా నెరవేరిందా అంటే లేదనే చెప్పాలి. ఆరంభమే నిరాశపరిస్తే.. ఆ తర్వాత వచ్చిన స్టార్ మూవీస్ కూడా యావరేజ్ అనిపించుకున్నాయి. కాకపోతే సమ్మర్ మాత్రం మెరుపులు మెరిపిచింది. ఊహించని విజయాలు.. ఊహించని పరాజయాలతో సమ్మర్ సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచింది. ఇవన్నీ పక్కన బెడితే ఇక ఇప్పుడు 2018 ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసుకోబోతున్నాం.
కొత్త యేడాది వస్తోందంటే టాలీవుడ్ కు కొత్త కలలు వస్తుంటాయి. అలా ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలే పెద్ద దెబ్బకొట్టాయి. సంక్రాంతి బరిలో నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఆల్ టైమ్ డిజాస్టర్ అనిపించుకుంటే బాలయ్య జై సింహా కూడా హిట్ కాలేదు. రాజ్ తరుణ్ రంగుల రాట్నం కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ మూడూ రెండు రోజుల గ్యాప్ లో వచ్చినా.. ఒకదాన్ని మించి మరొకటి నిరాశపరిచాయి.
ఫిబ్రవరిలో టాలీవుడ్ లో సమ్మె అనౌన్స్ అయింది. ఆప్రభావం కొంత వరకూ చిన్న సినిమాలపై పడ్డా.. ఫిబ్రవరి మాత్రం కొత్త ఊపునిచ్చింది. ఛలో తర్వాత ఫిబ్రవరి 10న వచ్చిన తొలిప్రేమ మంచి హిట్ అనిపించుకుంది. వరుణ్ తేజ్ కు ఇది కూడా ఫస్ట్ బిగ్ హిట్ గా నిలిచింది. వెంకీ అట్లూరి అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఫిబ్రవరి 9న వచ్చిన సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ అతన్ని మరోసారి పూర్తిగా నిరాశపరిచింది. అలాగే చాలాకాలం తర్వాత మోహన్ బాబు సోలో హీరోగా నటించిన గాయత్రి కాన్సెప్ట్ బావున్నా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక మార్చి మూడో వారంలో వచ్చిన సినమాలపై కాస్త అంచనాలుండేవి. వాటిలో కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే సినిమా ఒకటి. పదేళ్ల తర్వాత కాజల్ తో అతను నటించిన సినిమా. ట్రైలర్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే అతనికి మరో పటాస్ అవుతుందనుకున్నారు. కానీ కాలేదు. ఎమ్మెల్యేతో పాటు వచ్చిన నీదీనాదీ ఒకే కథ వైవిధ్యమైన సినిమాగా విపరీతమైన ప్రశంసలు దక్కించుకుంది.
ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడే ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.. ఇది హిట్ అని. రెండో పాట.. అంచనాలు పెంచింది. మూడో పాటతో మస్ట్ వాచ్ గా తేల్చారు. టీజర్ చూశాక.. మనం ఓ గొప్ప సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ వచ్చేసింది. ఇలా ఎవరి ఫీలింగ్ నూ డిజప్పాయింట్ చేయకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆ సినిమా రంగస్థలం. మార్చి 30న వచ్చిన రంగస్థలం క్రేజ్ కు అన్ని రికార్డులూ వెనక్కి వెళ్లిపోయాయ్. ఇప్పుడు నాన్ బాహుబలి రికార్డ్ రామ్ చరణ్ దే. సుకుమార్ చేసిన మ్యాజిక్ కు ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారనడానికి ఈ కలెక్షన్సే ఎగ్జాంపుల్.
ఏప్రిల్ 20.. భారీ అంచనాల మధ్య వచ్చింది భరత్ అనేనేను. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా. అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది భరత్. ఈ మధ్య వరుస ఫ్లాపులతో ఉన్న మహేష్ కు భరత్ అనేనేను భారీ ఊరటనిచ్చింది. కంటెంట్ ప్రధానంగా వచ్చిన ఈ సినిమాకు కాసులు కూడా భారీగా వచ్చాయి. అటు ఓవర్శీస్ లో కూడా సత్తా చాటి.. మహేష్ మొహంలో ఆనందం నింపింది.
తెలుగులో బయోపిక్స్ లేవు. అందునా ఓ మహిళ బయోపిక్ అంటే ఊహించలేం అనుకున్నారు. కానీ ఆ ఊహను నిజం చేస్తూ మనల్ని మరో లోకానికి తీసుకువెళ్లాడు దర్శకుడు నాగ అశ్విన్. మహానటి సావిత్రి బయోపిక్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఎంటైర్ టాలీవుడ్ ను సర్ ప్రైజ్ చేశాడు. మే 9న వచ్చిన మహానటి చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే తెలుగులో బయోపిక్స్ కు కొత్త ఊపునిచ్చింది.
మొత్తంగా ఈ ఫస్ట్ హాఫ్ ఊహించినంత గొప్పగా ఏంలేదనే చెప్పాలి. సమ్మర్ మాత్రమే ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా.. సెకండ్ హాఫ్ లో స్పైసీ మూవీస్ ఉన్నాయి. చరణ్, తారక్ దసరా బరిలో ఉన్నారు. ఆగస్ట్ లో కూడా చాలా సినిమాలున్నాయి. మరి ఇవైనా మంచి విజయాలు సాధించి.. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన లోటును భర్తీ చేయాలని.. టాలీవుడ్ కు మరిన్ని లాభాలు తేవాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







