30 ఏళ్ళుగా అభాలో చెత్త క్లీన్‌ చేస్తున్న ఇండియన్‌

- June 03, 2018 , by Maagulf
30 ఏళ్ళుగా అభాలో చెత్త క్లీన్‌ చేస్తున్న ఇండియన్‌

అభా: ఇండియన్‌ స్ట్రీట్‌ క్లీనర్‌, 30 ఏళ్ళుగా అభాలో స్ట్రీట్‌ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అక్బర్‌ షేక్‌ అనే వ్యక్తి, సదరన్‌ సౌదీ సిటీలో ఆరు రమదాన్‌లను జరుపుకున్నాడు. స్వదేశంలో రమదాన్‌ కంటే, కింగ్‌డమ్‌లో రమదాన్‌నే తాను బాగా ఆస్వాదిస్తున్నట్లు చెప్పారాయన. అభాలో ప్రతి వ్యక్తీ పవిత్ర రమదాన్‌ మాసంలో ఉపవాసం చేస్తారనీ, ఇండియాలో కేవలం ముస్లింలు మాత్రమే ఆ పని చేస్తారని షేక్‌ చెప్పారు. తన కుటుంబం కోసం రాత్రింబవళ్ళు శ్రమించాల్సి వస్తోందని అంటున్నారాయన. అభాలోని మెయిన్‌ ట్రాఫిక్‌ లైట్స్‌ వద్ద షేక్‌ పనిచేస్తుంటారు. రోడ్డుపై చెత్తను క్లీన్‌ చేయడమే అతని పని. చాలామంది డ్రైవర్లు, చెత్తను రోడ్డు మీద పారవేయడానికి సిగ్గుపడతారట. అంతలా చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో షేక్‌ పనిచేస్తుంటారట. రోడ్డుపై వెళ్ళేవారు ఇచ్చే ఆహార పదార్థాలతో ఆయన ఉపవాసాన్ని ముగిస్తారు. కొన్ని సార్లు కేవలం అతని వద్ద కొన్ని డేట్స్‌, వాటర్‌ బాటిల్‌ మాత్రమే వుంటాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని తనకూ వుంటుందనీ, అయితే వారికి మంచి జీవనం అందించడం కష్టపడాల్సి వస్తోందని షేక్‌ అంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com