దుబాయ్:విల్లా స్విమ్మింగ్ పూల్‌లో ఇద్దరు చిన్నారుల మునక
- June 03, 2018
దుబాయ్:దుబాయ్‌లోని మిర్దిఫ్ ప్రాంతంలోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో ఇద్దరు చిన్నారులు మునిగిపోయారు. వీరిలో ఒకరు ఏడాదిన్నర బాలిక కాగా, మరొకరు రెండున్నరేళ్ళ బాలుడు. ఇఫ్తార్ విందు జరుగుతున్న సమయంలో చిన్నారులిద్దరూ ఆడుకుంటూ అక్కడి నుంచి వెల్ళిపోయి, మృత్యువాత పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. తమ పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళిన తమకు, సిమ్మింగ్ పూల్‌లో విగత జీవులుగా తమ చిన్నారులు కన్పించారని వాపోయారు. సంఘటనా స్థలంలోనే బాలిక మృతి చెందగా, పోలీసులు - రెస్క్యూ టీమ్ సకాలంలో స్పందించి, బాలుడ్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. చిన్నారుల మృతితో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..