కింగ్‌డమ్‌లో తొలిసారిగా.. కమ్యూనిటీ సర్వీస్ పనిష్‌మెంట్!
- June 04, 2018
బహ్రెయిన్:తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి మందుల్ని దొంగిలించి, ప్రైవేట్ క్లినిక్‌లో వాటిని విక్రయిస్తున్న లేడీ గవర్నమెంట్ సైకియాట్రిక్ డాక్టర్‌కి తొలుత ఏడాది జైలు శిక్ష విధించిన న్యాయస్థానం, ఆ తర్వాత ఆమెకు ఏడాది పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాల్సిందిగా శిక్షను సవరించిన ఘటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. కారణం తొలిసారిగా కింగ్‌డమ్‌లో ఇలాంటి శిక్ష విధించడమే. కేసు వివరాల్లోకి వెళితే, తన వద్దకు వచ్చే పేషెంట్లకు మందులు ఇవ్వాల్సిన డాక్టర్, వేరే చోట ఆ మందుల్ని కొనుగోలు చేయాల్సిందిగా రోగులకు సూచించేవారు. ఆమె తీరు పట్ల రోగుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ క్లినిక్‌ని నిర్వహిస్తున్న ఆ మహిళా డాక్టర్, దగ్గరలోని ఫార్మసిస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. మందుల్ని దొంగిలించి, వాటిని ఫార్మసీ కంపెనీకి విక్రయించి, అక్కడే రోగులు వాటిని కొనుగోలు చేసేలా డాక్టర్ ఒత్తిడి తీసుకురావడంతో విషయం బట్టబయలయ్యింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







