ఎన్టీఆర్ సినిమాలో నటించే అద్భుత అవకాశం

- June 05, 2018 , by Maagulf
ఎన్టీఆర్ సినిమాలో నటించే అద్భుత అవకాశం

విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారకరావు జీవిత నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ఎన్టీఆర్‌. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్‌.

'నటిస్తూ తెరమీద కనిపిస్తూ జీవించాలనుకునేవాళ్లు చాలా మందుంటారు. కానీ, మంచి అవకాశాలు రానివాళ్లు కొందరు.. ఏది మంచి అవకాశమో అర్థం కాని వాళ్లు కొందరు. అలాంటివాళ్లందరికీ ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఎస్‌బీకే ఫిల్మ్స్‌ నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ నటిస్తూ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఎన్‌టీఆర్' బయోపిక్‌లో ప్రాముఖ్యత ఉన్న కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నాం. ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారు రెండు ఫొటోలు, సెల్‌ఫోన్‌తో మీ పెర్‌ఫార్మెన్స్‌ని షూట్‌ చేసిన రెండు వీడియోలు(30 సెకన్లు) తీసి మాకు మెయిల్‌ ([email protected]) పంపండి అని పోస్టర్ ద్వారా ప్రకటించారు మూవీ మేకర్స్‌.

క్రిష్ ప్రస్తుతం ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథా చిత్రం 'మణికర్ణిక... ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ'తో బిజీగా ఉన్నాడు . 1857 నాటి భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఆగస్ట్‌లో ఈ మూవీ రిలీజ్ కానుండగా, దీని తర్వాత క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ పనులతో బిజీ కానున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com