'మిస్ అమెరికా'..స్విమ్‌సూట్లు లేకుండానే ర్యాంప్‌వాక్‌లు
- June 06, 2018
'మిస్ అమెరికా'..తొలిసారి కొత్తగా! స్విమ్‌సూట్లు లేకుండానే ర్యాంప్‌వాక్‌లు వాషింగ్టన్: అందాల పోటీల్లో పాల్గొనే మోడళ్లు స్విమ్‌సూట్లు, బికినీలు ధరించి ర్యాంప్ వాక్‌లతో హోయలొలికిస్తుంటారు. అయితే తొలిసారి అందాల పోటీల విషయంలో అగ్రరాజ్యం అమెరికా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే మిస్ అమెరికా పోటీల్లో స్విమ్‌సూట్లు లేకుండా పోటీదారులు ర్యాంప్ వాక్‌లు చేయబోతున్నారు. ఈ విషయాన్ని మిస్ అమెరికా ఆర్గనైజేషన్ నిర్వాహకులు ట్విటర్ ద్వారా ప్రకటించారు. 'మేము బికినీలకు గుడ్‌బై చెబుతున్నాం. ఇకపై స్విమ్‌సూట్స్‌తో పోటీలు నిర్వహించం' అని ఆర్గనైజేషన్ ట్వీట్‌లో పేర్కొంది. మహిళా సాధికారత, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మిస్ అమెరికా పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి పోటీదారులు స్విమ్‌సూట్లు వేసుకుని ర్యాంప్ వాక్‌లు చేయడం సంప్రదాయంగా వస్తోంది. తొలి మిస్ అమెరికా పోటీలను 1921లో న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీ బోర్డ్‌వాక్‌లో నిర్వహించారు. అప్పటినుంచి జరుగుతున్న ఈ పోటీల్లో మోడళ్లు స్విమ్‌సూట్స్‌లోనే ర్యాంప్‌వాక్ చేస్తున్నారు.
అయితే ఆర్గనైజేషన్‌లో ఉన్న నిర్వాహకులంతా ఆడవారే కావడంతో అందరూ చర్చించుకుని ఇకపై మోడళ్ల చేత స్విమ్‌సూట్స్‌తో ర్యాంప్‌వాక్ చేయించకూడదని నిర్ణయించుకున్నారు. 2019 మిస్ అమెరికా పోటీలు సెప్టెంబర్ 9న అట్లాంటిక్ సిటీలో ప్రారంభం కానున్నాయి. ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ మార్పులు ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. మున్ముందు నిర్వహించబోయే పోటీల్లో పోటీదారులు తమ ఇష్టాయిష్టాలు, సామాజిక అంశాల గురించి వివరించే విషయాలను బట్టి విజేతలను ఎంపికచేయబోతున్నట్లు మాజీ మిస్ అమెరికా, ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్ గ్రెషెన్ కార్ల్‌సన్ వెల్లడించారు.
ఛైర్‌పర్సన్ కాకముందు కార్ల్‌సన్ ఫాక్స్ న్యూస్ ఛానెల్‌లో పనిచేసేవారు. అక్కడ వ్యాపార, వినోద రంగానికి చెందిన బడా వ్యక్తులు కార్ల్‌సన్‌ను లైంగికంగా వేధించారు. దాంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..