ప్లాస్టిక్ బ్యాగ్ బ్యాన్‌పై అప్‌డేట్ విడుదల చేసిన మినిస్ట్రీ
- June 07, 2018
మస్కట్: ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, తద్వారా మానవాళికీ వాటిల్లుతున్న ముప్పు నేపథ్యంలో ప్లాస్టిక్ బ్యాగ్స్‌పై బ్యాన్‌కి సంబంధించి తాజా రెగ్యులేషన్‌ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ వెల్లడించింది. ఆన్ లైన్ ద్వారా వెల్లడించిన ఈ ప్రకటనలో, ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగుల్ని వినియోగించే దిశగా రిజల్యూషన్ వుంటుందని పేర్కొంది. మార్కెట్‌ని, అలాగే పలు రకాలైన బ్యాగ్స్‌కి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత, రిజల్యూషన్‌కి రూపకల్పన చేయబోతున్నామనీ, త్వరలోనే నిర్ణయం వెలుగు చూస్తుందని, దీనికి స్పెసిఫికేషన్స్ అండ్ స్టాండర్డ్స్ కమిటీ - మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అప్రూవల్ లభించాల్సి వుందని మినిస్ట్రీకి చెందిన అధికారి ఒకరు గతంలో చెప్పారు. ఒమన్‌లో ఓ సూపర్ మార్కెట్ ఛైన్‌కి చెందిన మేనేజర్ మాట్లాడుతూ, రోజూ 75,000 నుంచి 80,000 వరకు ప్లాస్టిక్ బ్యాగ్స్‌ని తమ బ్రాంచ్ నుంచి వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ దాదాపు 15 వేల మంది విజిటర్స్, ఒక్కొక్కరు ఐదేసి చొప్పున బ్యాగ్స్‌ని రోజూ తీసుకెళుతుంటారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







