జూన్‌ 15న ఈద్‌ అల్‌ ఫితర్‌: ఆస్ట్రానమీ సెంటర్‌

- June 07, 2018 , by Maagulf
జూన్‌ 15న ఈద్‌ అల్‌ ఫితర్‌: ఆస్ట్రానమీ సెంటర్‌
చాలా ముస్లిం దేశాల్లో షవ్వాల్‌ మూన్‌, జూన్‌ 14న అంటే గురువారం చూసే అవకాశం వుందని అబుదాబీలోని ఇంటర్నేషనల్‌ ఆస్ట్రానమీ సెంటర్‌ పేర్కొంది. దీని ప్రకారం ఈద్‌ అల్‌ ఫితర్‌ జూన్‌ 1న సెలబ్రేట్‌ చేసుకోవాల్సి వుంటుంది. మూడు రోజుల సెలబ్రేషన్స్‌లో భాగంగా జూన్‌ 15 తొలి రోజు అవుతుంది. అయితే యూఏఈలో మాత్రం మూన్‌ సైటింగ్‌ కొంత కష్టతరమయ్యే అవకాశం వుంది. దానిక్కారణం సన్‌ సెట్‌ తర్వాత 41 నిమిషాలకు అంతర్ధానం కానుంది. క్రిసెంట్‌మూన్‌ని టెలిస్కోప్‌ ద్వారా ఈస్ట్‌ మరియు సౌత్‌ ఈస్ట్‌ ఏసియన్‌ కంట్రీస్‌ అలాగే, యూరోప్‌లో దర్శించవచ్చు. అరబ్‌ ప్రపంచంలో అయితే క్రిసెంట్‌ మూన్‌ అంత తేలిగ్గా కన్పించే అవకాశం లేదు. వెస్టర్న్‌ రీజియన్‌లోని సదరన్‌ మొరాకో, మారిటానియా, వెస్ట్‌ ఆఫ్రికాలలో మాత్రం కన్పించే అవకాశం వుంది. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com