ముంబైలో భారీ అగ్నిప్రమాదం..

- June 08, 2018 , by Maagulf
ముంబైలో భారీ అగ్నిప్రమాదం..

ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోర్ట్ ఏరియాలోని పటేల్ ఛాంబర్స్‌లో జరిగిన ప్రమాదంలో ఓ ఐదంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయింది. మంటల వేడి తీవ్రతకు కొంత భాగం కూలిపోయింది. నిన్న రాత్రి మొదలైన మంటల్ని అదుపు చేసేందుకు 18 ఫైరింజన్లను రంగంలోకి దించారు. దాదాపు 150 మంది సిబ్బంది తెల్లవార్లూ కష్టపడి మంటల్ని ఆర్పగలిగారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఫైర్‌మెన్‌లు గాయపడ్డారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటన్నది తెలియలేదు. ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలో 10 రోజుల వ్యవధిలోనే జరిగిన మరో భారీ అగ్నిప్రమాదం స్థానికుల్ని టెన్షన్ పెట్టింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com