ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం..

- June 08, 2018 , by Maagulf
ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం..

జూన్ 4న రాయలసీమ, కోస్తాంధ్రను తాకిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయి. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, జూన్ 15 నుంచి కాస్త తగ్గుముఖం పడతాయని వాతావరణశాఖ డైరక్టర్ నాగరత్న తెలియజేసారు. హైదరాబాద్ నగరంలో డ్రైవింగ్ చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవింగ్ చేయడం ఈజీ అంటారు. నిజమేనేమో.. రూల్స్ పాటించని జనాలు, వాళ్లని కంట్రోల్ చేయలేని ట్రాఫిక్ పోలీసులు. ఆఫీసులు ముగించుకుని ఇంటికి త్వరగా చేరుకుందామంటే ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని ఇంటికి వెళ్లేసరికి తల ప్రాణం తోకకి వస్తుంది నగర వాసికి. దానికి తోడు వర్షం కూడా పడిందంటే అందరి దేవుళ్లూ కళ్ల ముందు కనిపించేస్తారు. అసలే గతుకుల రోడ్లు, ఆపై ఎక్కడ డ్రైనేజీ పొంగి ప్రవహిస్తుందో తెలియని పరిస్థితి. మరో పక్క పైపు లైన్ల కోసం తవ్విన మట్టి రోడ్డు. పక్కనుంచి వెళదామంటే అందులో పడితే అడ్రస్ ఉండదేమోనన్న భయం. వెరసి వర్షాకాలం అంటే ఓ పక్క రైతు కళ్లలో ఆనందం కనిపించినా పట్నవాసికి మాత్రం నరకం కనిపిస్తుంది. ప్రభుత్వాల పనితీరుని తప్పుబడుతూ రోజూ ప్రయాణం సాగించవలసిన దుస్థితి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com