స్కాలర్‌షిప్‌లకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆహ్వానం
- June 08, 2018
అమెరికా:ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు తన వంతుగా సేవలందిస్తోంది. 1977 లో ఏర్పాటైన తానా ఇప్పటికీ లాభాపేక్షలేని సంస్థగా తెలుగు వారికి విశేషంగా సాయపడుతోంది. ఇప్పుడు ఆ సంస్థ అమెరికాలో చదివే తెలుగు విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. 2018-19 ఏడాదికి గాను.. డిగ్రీ చదువుకునే విద్యార్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. చదువుకునే సామర్థ్యం ఉండి.. ఆర్థిక స్థోమత లేని వారికి అందులోను అమెరికాలో విద్యాభాస్యం చేసేందుకు దరఖాస్తులను కోరుతోంది. మొత్తం ఏడు రకాల గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లను అందించనుంది తానా. తానా ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి 2000 డాలర్లను అందించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉంటున్న తెలుగువారు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌లను పొందవచ్చు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. సెమిస్టర్ ప్రకారం ఒక్కో సెమిస్టర్‌కు 500 డాలర్ల చొప్పున నాలుగు సెమిస్టర్లకు వీటిని అందించనున్నారు.
గతంలో విద్యార్థులు చదువుకున్న విద్యను విజయవంతంగా పూర్తి చేసిన వారు మాత్రమే తానా స్కాలర్‌షిప్ అందుకునేందుకు అర్హులు. అంతే కాదు.. నాలుగు యూత్ స్కాలర్‌షిప్‌లను అందించనుంది తానా. ఉత్తర అమెరికాలో హైస్కూలు విద్యను పూర్తి చేసుకుని కాలేజి చదువులకు వెళ్లే విద్యార్థులకు నాలుగు రకాల యూత్ స్కాలర్‌షిప్‌లను అందించనుంది.
ఒక్కోక్కరికి 1000 డాలర్లను ఇవ్వనుంది. తానా ఫౌండేషన్ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. మరిన్ని వివరాలకు తానా ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు(248-342-6872)ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..