రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు
- June 09, 2018
ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడింది. నారాయణగూడలో డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్ ప్రారంభమైంది. 53 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చింది వైద్యశాఖ. డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్ పేద ప్రజలకు వరమన్నారు మంత్రి కేటీఆర్. పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్ ప్రారంభమైంది. నారాయణగూడ ఐపీఎం క్యాంపస్‌లో హబ్‌ను మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్ ప్రారంభించారు. ఇందులో ఉచితంగా 53 రకాల వైద్య పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 106 కేంద్రాల నుంచి సెంట్రల్ హబ్‌కు నమూనాలు రానున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు. వైద్య పరికరాల గురించి డాక్టర్లు వివరించారు. మంత్రి కేటీఆర్‌కు వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్ పేద ప్రజలకు వరమన్నారు కేటీఆర్. పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సర్కారు వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. కేసీఆర్ కిట్లు వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో 40 నుంచి 50 శాతం ప్రసవాలు పెరిగాయన్నారు కేటీఆర్.
డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు తెలంగాణ వైద్య చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా అన్ని రకాల పరీక్షల రిపోర్టులు 24 గంటల్లో ఇచ్చేలా ఏర్పాటు చేశారు. 3 షిఫ్ట్‌ల్లో సిబ్బంది సేవలు అందించనున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







