జూలై 17 నుంచి నిలిచిపోనున్న యాహు మెసెంజర్ యాప్ సేవలు
- June 09, 2018
ఇక యాహూ మెసెంజర్ సేవలు నిలిచిపోనున్నాయి. జూలై 17వ తేదీ నుంచి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు దాని నిర్వహణ సంస్థ ఓత్ ఐఎన్‌సీ వెల్లడించింది. యాహూ మెసెంజర్ యూజర్ల ఐడీలు మాత్రం అలాగే ఉంటాయని వాటిని మెయిల్, ఇతర సేవలను వాడుకునేందుకు ఆ ఐడీ పనికొస్తుందని తెలిపింది. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ వంటి మెసేజింగ్ యాప్స్‌కు..యాహూ మెసెంజర్ పోటీ ఇవ్వడంలో విఫలమైంది.దీంతో క్రమంగా యూజర్లు తగ్గుతూ వచ్చారు. ఇక ఆ మెసెంజర్ సేవలకు ముగింపు పలకక తప్పలేదు. కానీ ఒకప్పుడు నెటిజన్లకు యాహూ మెసెంజర్ ఒక్కటే చాటింగ్ మెసెంజర్‌గా ఉండేది . యూజర్ల అభిరుచికి తగినట్లుగా డిస్కస్ రూమ్స్ కూడా ఉండేవి. వాయిస్ చాట్, వీడియో చాట్ కూడా అందుబాటులో ఉండేది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..