రైతుబంధు'బ్రాండ్ అంబాసిడర్'విశాల్ !
- June 09, 2018
అటు సినిమాలు.. ఇటు సామాజిక-రాజకీయ కార్యకలాపాలు.. రెండువైపులా చురుగ్గా కదులుతూ వెర్సటైల్ హీరోయిజాన్ని చాటుకుంటున్న కోలీవుడ్ హీరో విశాల్. 'పందెం కోడి' ఫేమ్ గా యితడు తెలుగు ప్రేక్షకుడికి సైతం బాగా పరిచయం. తాజాగా.. సొంత బేనర్‌పై విశాల్ హీరోగా చేసిన 'ఇరుంబుతిరై' మూవీ 'అభిమన్యుడు' పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో నడుస్తూ.. తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు దీటుగా వసూళ్లు దండుకుంటున్నాడు 'అభిమన్యుడు'. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల రైతుల పట్ల ఔదార్యం చూపుతూ.. విశాల్ ఓ కీలక ప్రకటన చేశాడు. తెలుగు ప్రేక్షకుడు ఆదరిస్తున్న తీరు తనను ముగ్ధుడ్ని చేసిందని చెబుతూ.. 'అభిమన్యుడు' మూవీ సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే.. రైతుబంధు పేరుతో అన్నదాతల కోసం సరికొత్త పథకం పుట్టుకొచ్చి హల్చల్ చేస్తోంది. దీనిగురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కథలుకథలుగా చెప్పుకుంటున్న తరుణంలో.. తాజాగా విశాల్ దృక్పథం కూడా చర్చనీయాంశమైంది.
ఒక్కో టికెట్‌పై ఒక్కో రూపాయి చొప్పున రైతులకు అందివ్వనున్నట్లు చెప్పాడు హీరో విశాల్. తొలి వారంలో అభిమన్యుడు రూ. 12 కోట్ల మేర రాబట్టాడు. ఈ మొత్తంలో ఎంత వాటా రైతులకిస్తాడన్న లెక్క స్పష్టంగా తేలలేదు. డైరెక్ట్‌గా రైతులకు చేరేలా ఎలా అందిస్తాడన్న క్లారిటీ కూడా లేదు. ఏదేమైనా.. విశాల్ తన నిర్ణయంతో సినిమా సెలబ్రిటీల్లో కొత్త ఒరవడికి చోటిచ్చినట్లయింది. మరి 'అభిమన్యుడ్ని' ఎంతమంది మిగతా హీరోలు ఫాలో అవుతారో చూడాలి..!
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్