దుబాయ్ లో మృతిచెందిన జగిత్యాల వాసి
- June 10, 2018దుబాయ్:జగిత్యాల పట్టణం కృష్ణానగర్ వార్డ్ నెం.17 కు చెందిన డొల్లాని గణేష్ (60) ఈనెల 5న దుబాయ్ లో గుండెపోటుతో చనిపోయారు. మృతుని శవపేటిక సోమవారం ఉదయం ఏర్ ఇండియా విమానంలో దుబాయి నుండి హైదరాబాద్ కు చేరుకోనుంది. శవపేటికతోపాటు దుబాయ్ నుండి మృతుని చిన్న కుమారుడు కరుణాకర్ వస్తున్నారు. మృతుడు గణేష్ స్వగ్రామం మేడిపల్లి మండలం వల్లంపల్లి, కాగా జగిత్యాల పట్టణంలో స్థిరపడ్డారు. మృతునికి భార్య అరుణ, కుమారులు సంతోష్, కరుణాకర్ ఉన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి, ప్రవాసి మిత్ర అధ్యక్షులు మంద భీంరెడ్డిల విజ్ఞప్తిమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి జగిత్యాల పట్టణం వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గత 25 ఏళ్లుగా గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్నగణేష్ అకస్మాత్తుగా చనిపోవడంపట్ల వల్లంపల్లి మాజీ సర్పంచ్ సంపత్ రావు, జగిత్యాల 17వ వార్డు కౌన్సిలర్ వీరబత్తిని పద్మజ శ్రీనివాస్ లు సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..