భారతీయులకు క్షమాపణ చెప్పిన ప్రియాంక చోప్రా
- June 10, 2018
నెటిజన్ల ఆగ్రహానికి బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తలొగ్గింది. భారతీయులకు క్షమాపణ చెప్పింది. క్వాంటికో’ షోలో హిందువులను ఉగ్రవాదులుగా చూపడంపై ప్రియాంక చోప్రా విచారం వ్యక్తం చేసింది. ‘ఇటీవల ప్రసారమైన క్వాంటికో ఎపిసోడ్ భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండటంపై బాధను వ్యక్తం చేస్తున్నా. ఎవరినో కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నా. ఒక భారతీయురాలిగా నేను గర్వపడుతుంటాను. ఇది ఎప్పటికీ మారదు’’ అని ప్రియాంక ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఆమెతో పాటు క్వాంటికో’ నిర్మాణ సంస్థ ఏబీసీ, నిర్వాహకులు కూడా క్షమాపణ చెప్పారు.
అమెరికాలో పాపులర్ సీరియల్‌గా ‘క్వాంటికో’కు పేరుంది. అయితే, జూన్ 1న ప్రసారమైన షోలో భారతీయులను ఉగ్రవాదులుగా చూపించారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో పేలుళ్లకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తారు. వారి కుట్రను ఎఫ్‌బీఐ అధికారైన ప్రియాంక చోప్రా భగ్నం చేస్తుంది. అయితే ప్రియాంక చోప్రా ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఓ టెర్రరిస్ట్ మెడలో రుద్రాక్షమాల కనిపిస్తుంది. దాని ఆధారంగా వారు ఇండియన్స్ అని నిర్దారణకు వస్తారు. పాకిస్థాన్ టెర్రరిస్టుల ముసుగులో ఇండియన్సే పేలుళ్లకు ప్లాన్ చేశారు అనే విధంగా సీన్లో చూపించారు. ఆ సీన్‌పైనే భారతీయులు భగ్గుమన్నారు.
‘క్వాంటికో’ షోలో హిందువులను ఉగ్రవాదులుగా చూపడంపై సోషల్ మీడియాలో తీవ్ర దూమారం రేగుతోంది. భారతీయులను ఉగ్రవాదులుగా చూపిస్తుంటే.. భారతీయురాలిగా ఖండించకుండా ఎలా సమర్ధించావంటూ ప్రియాంకను జనాలు తిట్టిపోస్తున్నారు. దీంతో ప్రియాంక స్పందించి క్షమాపణ కోరింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్