భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్..

- June 11, 2018 , by Maagulf
భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా వస్తువులపై భారత్‌ 100 శాతం సుంకాన్ని వసూలు చేయడంపై ఆయన మండిపడ్డారు. అమెరికాను దోచుకునేందుకు ప్రయత్నించే దేశాలతో అవసరమైతే వాణిజ్య సంబంధాలను తెంచుకునేందుకు సైతం వెనుకాబడబోమని హెచ్చరించారు. పలు దేశాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వాణిజ్య పన్నులు అధికంగా వసూలు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అందరూ అమెరికానే దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమెరికా సంపదకు నష్టం వాటిల్లే విధంగా ఉంటే ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. 

భారత్‌లో తమ వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధిస్తున్నారని, కానీ తాము మాత్రం విధించడం లేదని ట్రంప్ తెలిపారు. తాము అలా వసూలు చెయ్యలేకపోతున్నామన్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్నహార్లీ డేవిడ్సన్‌ బైకులపై భారత్‌ అధిక శాతం పన్నులు వసూలు చేస్తుందని గతంలో ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య సంబంధాలు సంతృప్తికరంగా లేవు. ఈ నేపథ్యంలో మరోసారి ట్రంప్ భారత్ పేరు వాడుతూ కామెంట్స్ చేయడంతో టెన్షన్ నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com