మస్కట్ లో అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు
- June 11, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ సోహార్లో ఓ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని వెల్లడించింది. పిఎసిడిఎ వెల్లడించిన వివరాల ప్రకారం నార్త్ బతినా గవర్నరేట్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సెంటర్ టీమ్ అత్యంత చాకచక్యంగా మంటల్ని అదుపు చేసింది. ఈ క్రమంలో పొగను పీల్చి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వారికి అత్యవసర వైద్య చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని అధికారులు వివరించారు. మరో రెండు గటనల్లో దోఫార్ గవర్నరేట్ ఫైర్ ఫైటర్స్, ఓ వాహనం అగ్ని ప్రమాదానికి గురికాగా, మంటల్ని ఆర్పివేశారు. ఇబ్రిలోని ఓ వేర్ హౌస్ అగ్ని ప్రమాదానికి గురికాగా, సకాలంలో ఫైర్ ఫైటర్స్ మంటల్ని అదుపు చేయగలిగారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదుగానీ, ఆస్తి నష్టం సంభవించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..