ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని వాజ్‌పేయి

- June 11, 2018 , by Maagulf
ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని వాజ్‌పేయి

మాజీ ప్రధాని వాజ్ పేయిని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. రొటీన్ చెకప్, పరీక్షల నిమిత్తం వాజ్‌పేయిని హాస్పిటల్‌లో చేర్పించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ డైరెక్టర్, పల్మనాలజిస్ట్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా పర్యవేక్షణలో వాజ్ పేయికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుమారు 3 దశాబ్దాలుగా వాజ్ పేయికి పర్సనల్ ఫిజీషియన్ గా రణ్ దీప్ వ్యవహరిస్తున్నారు. వాజ్‌పేయి ఆరోగ్య సమస్యలపై డాక్టర్ గులేరియాకు పూర్తి అవగాహన ఉంది. అనారోగ్యంతో వాజ్‌పేయి 2009 నుంచి ఇంటికే పరిమితమయ్యారు. 

రాజకీయ దురంధరుడిగా పేరున్న వాజ్ పేయి 1924లో గ్వాలియర్‌లో జన్మించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో  రాజకీయాల్లోకి వచ్చారు. లక్నో లోక్ సభ స్థానం నుంచి 1991,1996,1998,1999, 2004 సంవత్సరాల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి. 2015లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారతరత్న అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com