జిసిసి రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రైవేట్‌ సెక్టార్‌ని

- December 10, 2015 , by Maagulf
జిసిసి రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రైవేట్‌ సెక్టార్‌ని

జిసిసి రీజియన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న మల్టీ బిలియన్‌ డాలర్‌ ప్రాజెక్ట్‌ అయిన రైల్‌ నెట్‌వర్క్‌ కోసం ప్రైవేటు సెక్టార్‌ని ఆశ్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌదీ రైల్‌ అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌కి చెందిన ఆరు దేశాలు ప్రాజెక్ట్‌ రెండో దశకు సంబంధించి డిజైన్‌ బిడ్స్‌ని విడుదల చేశాయి. సౌదీ రైల్వేస్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌ఆర్‌ఓ) ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ ఖలీద్‌ అల్‌ సువాఐకత్‌ మాట్లాడుతూ, కువైట్‌ బోర్డర్‌లోని సౌదిఅల్‌ ఖఫ్జి టౌన్‌ బోర్డనని ఈస్ట్‌ సౌద్‌ అరేబియాలోని అల్‌ హోఫుఫ్‌ మరియు యూఏఈ బోర్డర్‌లోని అల్‌ బట్నాని కలిపేలా రైల్‌ లింక్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆరు దేశాలు ప్రైవేట్‌ సెక్టార్‌ని ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలనుకుంటున్నాయనీ, అయితే ఇంకా ఇది చర్చల దశలోనే ఉందని వెల్లడించాయి. 2018 నాటికి పూర్తి చేయాలనుకుంటున్న 2117 కిలోమీటర్ల రైల్‌ లింక్‌ కోసం 15 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. సౌదీ అరేబియా, కువైట్‌, బహ్రెయిన్‌, ఖతార్‌, ఒమన్‌ దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com