మిలియన్ డాలర్లు ఎగ్గొట్టిన బాద్షాలు..
- June 15, 2018
ఓ సినిమాలో నటిస్తే కోట్లు.. ఒక్క యాడ్‌లో కనిపిస్తే లక్షలు.. ఓ షాపుకి రిబ్బన్ కట్ చేస్తే చేతిలో చెక్కులు. ఇదీ సినిమాల్లో స్టార్లుగా చెలామణి అవుతున్న వారి పరిస్థితి. ఏదైనా కాన్సర్ట్ చేస్తే అభిమానుల ఆనందత్సోహాలు, చేతినిండా వద్దంటే వచ్చి పడుతున్న డబ్బులు. ఇలానే అమెరికాలో వైబ్రంట్ మీడియా తలపెట్టిన ఓ కాన్సర్ట్కి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, గాయకుడు ఉదిత్ నారాయణ్ తదితరులంతా పాల్గొనవలసి ఉంది. దీనికోసం ఆ సంస్థ వీరితో మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ముందే వారికి నగదును ముట్టజెప్పింది. ఈవెంట్ 2013, సెప్టెంబర్ 1న జరగాల్సి ఉంది. అయితే అప్పటికే సల్మాన్ కృష్ణజింకల కేసులో నిందితుడిగా ఉన్నందున న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంది. అందుకే కాన్సర్ట్‌ని వాయిదా వేశారు. దీంతో తీసుకున్నపారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన సెలబ్రిటీలు ఇంతవరకు నగదు వాపసు ఇవ్వలేదని వైబ్రంట్ మీడియా పిటిషన్లో పేర్కొంది. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా కూడా స్పందించట్లేదు. సల్మాన్‌కి 2 లక్షల డాలర్లు, కత్రినాకు 40 వేల డాలర్లు, సోనాక్షికి 36వేల డాలర్లు ఇచ్చినా ఏ ఒక్కరూ తిరిగి ఇవ్వలేదని వాపోతున్నారు. దీనిపై ఇల్లినాయిస్ డిస్ట్రిక్ట్ కోర్టు విచారణ జరుపుతోందని సంస్ధ పేర్కొంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







