తాలిబన్ చీఫ్ హతం...

- June 15, 2018 , by Maagulf
తాలిబన్ చీఫ్ హతం...

అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడుల్లో... తాలిబన్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ దాడుల్లో తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ ముల్లా ఫజల్ ఉల్లాహ్ మృతిచెందినట్టు అమెరికా మిలిటరీ ప్రకటించింది. కునార్ ప్రావిన్స్‌ ప్రాంతంలో కౌంటర్ టెర్రరిజం శాఖ నిర్వహించిన దాడుల్లో ముల్లా ఫజల్ చనిపోయాడని ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఓడోనిల్ వెల్లడించారు. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లో జూన్ 13వ తేదీన ఈ దాడులు జరిగాయి. అమెరికా, పాకిస్థాన్‌లో ముల్లా ఫజల్ అనేక దాడులకు సూత్రధారిగా వ్యవహరించినట్లు అమెరికా ప్రకటించింది. డిసెంబర్‌ 2014లో పెషావర్ ఆర్మీ స్కూల్‌లో జరిగిన భీకర దాడికి ముల్లానే సూత్రధారి. ఆ దాడిలో సుమారు 151 మంది ప్రాణాలు కోల్పోగా... వారిలో 130 మంది చిన్నారులే... ఇక 2012లో నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్‌జాహీపై హత్యకు కూడా అతనే కుట్ర పన్నాడు. ముల్లా తలపై 5 మిలియన్ల డాలర్ల నజరానా కూడా ఉంది. అయితే ముల్లా ఫజల్ ఉల్లాహ్ మృతిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com