బెంగాల్ టైగర్:రివ్యూ
- December 10, 2015
టైటిల్ : బెంగాల్ టైగర్ జానర్ : మాస్ యాక్షన్ డ్రామా తారాగణం : రవితేజ, తమన్నా, రాశీఖన్నా, బొమన్ ఇరానీ, రావు రమేష్, శియాజీ షిండే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంపత్ నంది నిర్మాత : కె కె రాధామోహన్ సంగీతం : భీమ్స్ ఎడిటింగ్ : గౌతమ్ రాజు బలుపు, పవర్ సినిమాలతో ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన రవితేజ 'కిక్ 2' సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. ఈ సారి ఎలాగైన ఓ బ్లాక్ బస్టర్ తో ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో తనకు బాగా కలిసొచ్చే మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను ఎంచుకున్నాడు. రచ్చ లాంటి సూపర్ హిట్ తరువాత పవన్ కల్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తూ చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు సంపత్ నంది... తనని తాను ప్రూవ్ చేసుకోవటం కోసం ఓ పక్కా మాస్ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ ఇద్దరి ప్రయత్నం ఫలించిందా.. బెంగాల్ టైగర్ బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటి..? కథ : రాజమండ్రి దగ్గర ఓ పల్లెటూరిలో అల్లరి చిల్లరగా తిరిగే ఆకాష్ నారాయణ్ (రవితేజ)ను ఎలాగైన దారిలో పెట్టాలనుకున్న కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. పెళ్లి చూపులకని ఓ అమ్మాయి ఇంటికి వెళ్లిన ఆకాష్ ను ..పెళ్లికూతురు తాను ఫేమస్ వ్యక్తినేపెళ్లి చేసుకుంటా అంటూ రిజెక్ట్ చేస్తుంది. దీంతో ఎలాగైన ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఓ మంత్రి (శియాజీ షిండే)ని రాయితో కొట్టి వార్తల్లో వ్యక్తి అవుతాడు. ఆ తరువాత తన ధైర్యంతో ఆ మంత్రిని మెప్పించి అతని దగ్గరే పనిలో చేరుతాడు. అక్కడి నుంచి హోం మినిస్టర్( రావూ రమేష్ ) కూతురు (రాశీఖన్నా)ను కాపాడి, ఆమె సాయంతో ఆ ఇంట్లో పనిలో చేరుతాడు. అప్పటికే హోం మినిస్టర్ కూతురుకి పెళ్లి కుదురుతుంది. అయితే తన తెలివి తేటలతో ఆ ఇంట్లో వాళ్లందరినీ తనవైపు తిప్పకొని హోం మినిస్టరే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని ఆకాష్ తో పెళ్లి ఎనౌన్స్ చేసేలా చేస్తాడు. తీరా ఎనౌన్స్ చేశాక తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని ముఖ్యమంత్రి అశోక్ గజపతి కూతురు మీరా(తమన్నా)ను ప్రేమిస్తున్నాని ట్విస్ట్ ఇస్తాడు ఆకాష్. అసలు ఆకాష్, ఆ పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదు...? ఓ పల్లెటూరి నుంచి వచ్చిన ఆకాష్ కి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ. నటీనటులు : మాస్ మహరాజ్ గా అభిమానులు పిలుచుకునే రవితేజ మరోసారి ఓ పక్కా మాస్ క్యారెక్టర్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ తన ఎనర్జీని చూపించాడు. తమన్నా, రాశీఖన్నాలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. నటనకు పెద్దగా అవకాశం ఉన్న పాత్రలు కాకపోయినా, గ్లామర్ షో విషయంలో మాత్రం ఒరితో ఒకరు పోటీ పడ్డారు. 'అత్తారింటికి దారేది' సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బొమన్ ఇరానీ ఈ సినిమాతో నెగెటివ్ రోల్ లో మెప్పించాడు. పెద్దమనిషిలా కనిపిస్తూనే నెగిటివ్ షేడ్స్ బాగా చూపించాడు. అప్ కమింగ్ స్టార్ గా 30 ఇయర్స్ పృధ్వి, సెలబ్రిటీ శాస్త్రీగా పోసాని కృష్ణమురళి కామెడీ పండించారు. తనికెళ్ల భరణి, నాజర్, ప్రభ, నాగినీడు, రమాప్రభ ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : పక్కా మాస్ సినిమా చేయాలన్న ఉద్దేశంతో తెరకెక్కించిన సినిమా బెంగాల్ టైగర్. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, పంచ్ డైలాగ్ లు, కామెడీ క్యారెక్టర్లు, హీరోయిన్ల గ్లామర్ షో ఇలా మాస్ ఆడియన్స్ ను మెప్పించే అన్ని ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేశాడు దర్శకుడు సంపత్ నంది. అయితే తొలి భాగం కామెడీతో నడిపించిన సంపత్, సెకండాఫ్ లో యాక్షన్ మీద దృష్టి పెట్టాడు. మాస్ ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నంలో కథలో లాజిక్ మిస్ అవ్వటంతో అక్కడక్కడ సినిమా బోర్ అనిపిస్తుంటుంది. భీమ్స్ సంగీతం పరవాలేదనిపించింది. నేపథ్య సంగీతంతో మాత్రం ఆకట్టుకున్నాడు. రవితేజ ఎనర్జీని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా దర్శకుడిగా పర్వాలేదనిపించిన సంపత్ నంది, మాటల రచయితగా మాత్రం మంచి మార్కులు సాధించాడు. విశ్లేషణ : రవితేజ సినిమా అంటేనే మాస్ ఆడియన్స్ కు పండగ, అలాంటి పక్కా మాస్ ఎంటర్ టైనర్ బెంగాల్ టైగర్.. అయితే మాస్ ఆడియన్స్, అన్న టార్గెట్ లో కామన్ ఆడియన్స్ ను కాస్త దూరం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. పంచ్ డైలాగ్ లు, యాక్షన్ సీన్లు, భారీ బిల్డప్ ల మీద కాన్సన్ ట్రేట్ చేసిన దర్శకుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేయలేదు. ఇక కథలో కూడా ఎక్కడా లాజిక్ లేకపోవటం కాస్త నిరాశపరుస్తుంది. ఓ సామాన్యుడు ఏకంగా సిఎం స్థాయి వ్యక్తిని ఒంటరిగా నడిరోడ్డులో నిలబెట్టడం లాంటి సన్నివేశాలు కామన్ ఆడియన్స్ కు కూడా షాక్ ఇస్తాయి. అయితే రవితేజ క్యారెక్టర్ కు ఇచ్చిన బిల్డప్, కథలో స్పీడు ఇలాంటి లోపాలను పెద్దగా కనిపించకుండా కవర్ చేసింది. రవితేజ యాక్షన్, పృధ్వి, పోసానిల కామెడీ బొమన్ ఇరానీ, రావు రమేష్ ల విలనీ ఆకట్టుకుంటుంది. ప్లస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ కామెడీ డైలాగ్స్ నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : లాజిక్ లేని సీన్లు పాటలు ఓవరాల్ గా బెంగాల్ టైగర్ మాస్ ఆడియన్స్ ను మెప్పించే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్.
--మాగల్ఫ్ రేటింగ్:3.5
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









