తెలంగాణ రాష్ట్రంలోమళ్లీ పెరిగిన ఎండల తీవ్రత

తెలంగాణ రాష్ట్రంలోమళ్లీ పెరిగిన ఎండల తీవ్రత

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కొద్దిగా నెమ్మదించడంతో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. ఈ రోజు సైతం ఎండల తీవ్రత ఉంటుంది. ఉత్తర బీహార్ నుంచి తెలంగాణ వరకు జార్ఖండ్, ఒడిశా, దక్షిణ చత్తీస్‌గఢ్ మీదుగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆదిలాబాద్, హన్మకొండల్లో 38.5 డిగ్రీలు, నల్లగొండ, భద్రాచలంలో 38, హైదరాబాద్‌లో 36.9 డిగ్రీలు, ఖమ్మంలో 39,రామగుండంలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది.

Back to Top