మెగాస్టార్‌ని కలిసిన 'సమ్మోహనం' టీం

- June 17, 2018 , by Maagulf
మెగాస్టార్‌ని కలిసిన 'సమ్మోహనం' టీం

సుధీర్ బాబు, అదితీ రావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సమ్మోహనం' మూవీ పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుని హిట్ దిశగా దూసుకెళుతోంది. సినిమా విడుదల ముందు నుండే ప్రమోషన్స్ భారీగా నిర్వహించడం, మెగాస్టార్ చిరంజీవితో టీజర్, సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయనతో ట్రైలర్ రిలీజ్ చేయించడం, ప్రీ రిలీజ్ ఈవెంటుకు మహేష్ బాబు రావడం లాంటివి సినిమాపై అంచనాలు పెంచింది. అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తమ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఫుల్ హ్యాపీగా ఉన్న చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవిని కలిసి సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సమ్మోహనం మూవీ టీంను అభినందించడంతో పాటు సినిమాకు సంబంధించిన 'తారలు దిగి వచ్చిన వేళ' పుస్తకాన్ని విడుదల చేశారు. సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్‌కు సంబంధించిన పుస్తకం ఇది.

అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం సమ్మోహనం. సుధీర్‌బాబు హీరోగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

నటీనటులు:

సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, నరేశ్‌, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందు, కాదంబరి కిరణ్‌, హరితేజ, రాహుల్ రామకృష్ణ, కేదార్ శంకర్‌, శిశిర్‌శర్మ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్‌, కె. రామాంజనేయులు, కో డైరక్టర్‌: కోట సురేశ్ కుమార్‌, ప్రొడక్షన్ డిజైనర్‌: యస్ . రవీందర్‌, ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్‌ డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్‌, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com