రెండో కొడుకుని పరిచయం చేసిన ఎన్టీఆర్..!
- June 17, 2018
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. మహానటులు ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ తనయుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 'స్టూడెంట్ నెం.1'చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత.. వీర రాఘవ' చిత్రంలో నటిస్తున్నాడు.
తాజగా ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి జంటకు రెండో మగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు అభయ్ రామ్. గత వారంలో జన్మించిన తన రెండో కుమారుడిని ఎన్టీఆర్ తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశాడు. సోషల్ మీడియా ఫొటో షేరింగ్ ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల ఖాతా తెరిచిన ఎన్టీఆర్, దానిలో తొలి పోస్టుగా ఉంచిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అభయ్ రామ్ తన చేతుల్లో తమ్ముడిని ఎత్తుకుని ఓ కుర్చీలో కూర్చుని ఉండగా, ఎన్టీఆర్ తన స్మార్ట్ ఫోన్ లో దాన్ని చిత్రీకరిస్తున్నట్టు ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటోకి మంచి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







