అల్లు శిరీష్ హీరోగా 'ఎబిసిడి' మొదలైంది
- June 18, 2018
అల్లు శిరీష్ హీరోగా ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) మూవీ సోమవారం ప్రారంభం అయింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఎబిసిడి చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రంలో 'కృష్ణార్జున యుద్ధం' ఫేమ్ రుక్సర్ ధిల్లాన్ కథానాయిక. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు కన్నడ కంపోజర్ జుడా శాండీ సంగీతం అందిస్తున్నారు.చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. బాల నటుడిగా మనల్ని ఎంటర్టైన్ చేసిన మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టులో మార్పులు చేశాం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు అని తెలిపారు.
నటీనటులు
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్
సాంకేతిక వర్గం
మ్యూజిక్ డైరెక్టర్ - జుధా సాంధీ
కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
బ్యానర్స్ - మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు - మధుర శ్రీధర్, యష్ రంగినేని
దర్శకుడు - సంజీవ్ రెడ్డి
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!