తెలుగు న్యూస్ రీడర్ ఆత్మహత్య..!
- June 18, 2018
ఈ మద్య కాలంలో వెండితెర, బుల్లితెరపై వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ న్యూస్ రీడర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన తేజశ్విని నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయవాడ శివార్లలో ఉన్న ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో గత కొంతకాలంగా తేజశ్విని, ఆమె భర్త పవన్ కుమార్ ఉంటున్నారు.
తేజశ్విని ఓ ఛానల్ లో పని చేసేది. పవన్ కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న కలతలు రావడం పెద్దవాళ్లు సర్ధి చెప్పడం జరుగతూ వస్తుందట. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అత్త అన్నపూర్ణాదేవితో తేజశ్విని గొడవ పడింది. కొద్ది సేపటి తర్వాత తేజశ్విని తన ఇంట్లోకి వెళ్లి గది తలుపులు పెట్టుకొని ఎంత సేపటికీ తీయలేదట.
ఎంతకూ తేజశ్విని రాకపోవడంతో... అనుమానం వచ్చిన అత్త గదిలోకి వెళ్లి చూసింది. గదిలోకి వెళ్లిన తేజశ్విని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉండటం చూసి షాక్ తిన్నది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!