యూకే-ఇండియా వీక్ 2018: 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న కార్యక్రమాలు

- June 18, 2018 , by Maagulf
యూకే-ఇండియా వీక్ 2018: 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న కార్యక్రమాలు

తొలిసారి యూకే-ఇండియా వీక్‌తో రెండు దేశాలు క్రాస్ రోడ్స్‌లో ఉన్నవి. బ్రిటన్‌కు బ్రెగ్జిట్ సరికొత్త, ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం ఒక అవకాశంగా మారింది. అదే సమయంలో భారత్ ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అలాంటి భారత్‌తో యూకే జతకడితే ఇరు దేశాలు ఆర్థికంగా అద్భుతాలుసృష్టిస్తాయి. యూకే, భారత్‌లు వ్యూహాత్మక భాగస్వామ్యంతో ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన చోటు సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.: గ్లోబల్ బ్రిటన్ మీట్స్ గ్లోబల్ ఇండియా.

తొలి యూకే-ఇండియా వీక్ వేడుకలు (18 జూన్ నుంచి 22 జూన్ వరకు ) భాగస్వామ్య దేశాల మధ్య జరగనున్నాయి. ఈ వేడుకల్లో జరగనున్న పలు కార్యక్రమాలు.

జూన్ 18: యూకే-భారత్‌ల మధ్య సంబంధాలు బలపడేందుకు ప్రభావితం చేసిన 100 మందికి సన్మానం: యూకే భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికై కృషి చేసిన వ్యక్తులకు యూకే ఇండియా వీక్ వేడుకలు ప్రారంభోత్సవం సందర్భంగా సన్మానం.

జూన్ 20-21: యూకే-భారత్‌ల మధ్య 5వ వార్షికోత్సవ నాయకత్వ సదస్సు: యూకే-భారత్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, ఇరు దేశాల అభివృద్ధి, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చ

జూన్ 22- యూకే-ఇండియా అవార్డులు 2018: యూకే-భారత్‌ల మధ్య బంధాన్ని తెలుపుతూ ఇందుకు కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు వేడుకలో అవార్డుల బహూకరణ

16 మే 2018, లండన్: యూకే-ఇండియా వీక్ (18 జూన్ నుంచి 22 జూన్ వరకు) ప్రారంబోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కార్యనిర్వహణ ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది. యూకే భారత్‌ల మధ్య బలమైన బంధం ఏర్పడటాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది.

యూకే ఇండియా వీక్‌లో ఇండియా inc ఏర్పాటు చేసిన 5వ వార్షికోత్సవ నాయకత్వ సదస్సుతో సహా పలు కార్యక్రమాలు ఉంటాయి. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక భారత్‌తో భాగస్వామ్యం ఎలా ఉండబోతోందో ఆవిష్కరించడం జరుగుతుంది.

యూకే భారత్‌ల మధ్య సంబంధాలు బలపడేందుకు కృషి చేసిన లేదా ప్రభావితం చేసిన 100 మంది పై బుక్ రిలీజ్ కార్యక్రమం. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడేందుకు కృషి చేసిన వ్యక్తులు వారు సాధించిన విజయాల గురించి వేడుకలో ప్రస్తావిస్తూ వారిని సన్మానించడం జరుగుతుంది.

యూకే ఇండియా అవార్డులు అందజేయడం ద్వారా యూకే ఇండియా వేడుకలు ముగుస్తాయి. జూన్ 22న జరిగే ఈ కార్యక్రమంలో యూకే భారత్‌ల మధ్య బంధాన్ని ఒక వేడుకగా నిర్వహిస్తాము. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలకోసం కృషి చేసిన ఇతర ఆసియా దేశాలు, సంస్థలను గౌరవించడం జరుగుతుంది. వాణిజ్యం, రాజకీయాలు, దౌత్య, కళలు మరియు సంస్కృతి రంగాలకు చెందిన దాదాపు 400 మంది నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి సమక్షంలో అవార్డుల ప్రదానోత్సవం జూన్ 22 సాయంత్రం జరుగుతుంది. వాణిజ్య రాజకీయ రంగంలో విశేష అనుభవం ఉన్న వారు ఈ అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేశారు.

*లార్డ్ మార్లాండ్, ఛైర్మెన్, కామన్ వెల్త్ ఎంటర్ ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్.

* గౌరవనీయులు బ్యారీ గార్డినర్ ఎంపీ, షాడో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్

* రిటైర్డ్. హానరబుల్ ప్రీతి పటేల్ ఎంపీ, మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్

* సునీల్ భారతి మిట్టల్, భారతీ ఎంటర్ ప్రైజెస్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మెన్

* భర్కాదత్, రచయిత్రి మరియు ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత

*ఎడ్విన్ డన్, సీఈఓ, స్టార్ కౌంట్

ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ సంబంధాలు మరియు చోటుచేసుకుంటున్న మార్పులపై ఇరుదేశాల పాత్రను యూకే ఇండియా వేడుకల్లో వెలుగెత్తి చాటాలని భావిస్తున్నాం.

బ్రిటీష్ ఇండియన్ పారిశ్రామికవేత్త , మరియు రాజకీయ విశ్లేషకులు, యూకే ఇండియా వీక్ వ్యవస్థాపకులు, విన్నింగ్ పార్ట్‌నర్షిప్ : ఇండియా యూకే రిలేషన్స్ బియాండ్ బ్రెగ్జిట్ ఎడిటర్ మనోజ్ లాద్వ ఇలా అన్నారు.

"ప్రపంచ దేశాల్లో చోటుచేసుకుంటున్న మార్పు నేపథ్యంలో యూకే భారత్‌ల మధ్య బంధం ఎప్పటిలాగే కొనసాగింది. ఇరుదేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక విభాగాల్లో ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఇరుదేశాలు కలిసి పరిష్కరిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వృద్ధి రేటులో భారత్ కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. మరోవైపు యూకే కూడా భారత్‌తో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధం అవుతోంది. రెండు దేశాలు కలిసి పనిచేస్తే పరిశ్రమల్లో పెను మార్పు రావడమే కాదు.. అంతర్జాతీయ సంబంధాలు కూడా మెరుగవుతాయి. ఇది సాధ్యం కావాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. వాణిజ్య రంగంలో భారత్‌ను యూరప్ గేట్‌వేగా యూకే పరిగణించాల్సి ఉంది. అదే సమయంలో భారత్‌తో వ్యాపార సంబంధాలపై కృషి చేయాల్సి ఉంది.

"ఆర్థిక భాగస్వాములుగానే కాక యూకే భారత్‌లు లావాదేవీల భాగస్వాములుగా కూడా ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా ఇరు దేశాలు పరివర్తన చెందాల్సి ఉంది. భవిష్యత్తులో రెండు దేశాలు పరిశోధనలు, విద్యపై దృష్టి సారించి భవిష్యత్ తరాలకు మేలు చేయగలగాలి. నూతన సాంకేతికతను ఆవిష్కరించి వృద్ధికి దోహదపడాలి. ఇలాంటి చర్చలో పాల్గొని తమ విలువైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు యూకే ఇండియా వీక్ సరైన వేదికగా భావిస్తాను.

యూకే ఇండియా వీక్ గురించి:

జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న యూకే ఇండియా వీక్ వేడుకలు యూకే భారత దేశాల మధ్య వాణిజ్య అవకాశాలు మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది. ఈ వేడుకల్లో యూకే భారత్ 5వ వార్షిక నాయకత్వ సదస్సు నిర్వహణతో పాటు పలు కార్యక్రమాలు ఉన్నాయి. బ్రెగ్జిట్ బ్రిటన్ ఇండియా దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు పరివర్తన చెందేందుకు ఈ వేడుకలు గీటురాయిగా నిలుస్తాయి.

యూకే భారత్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు కృషి చేసిన 100 మంది వ్యక్తులను సన్మానించడం ద్వారా జూన్ 18న ఈ వేడుకలు ప్రారంభం అవుతాయి. జూన్ 19న గోల్ఫ్ టోర్నమెంట్ హైకమిషనర్ కప్ జరుగుతుంది. ఇందులో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు, హైకమిషనర్లు పాల్గొంటారు. జూన్ 22న జరిగే రెండవ వార్షకోత్సవ యూకే ఇండియా అవార్డులతో కార్యక్రమం ముగుస్తుంది.

India Inc గురించి:

India Inc అనే సంస్థ లండన్ కేంద్రంగా పనిచేసే మీడియా హౌజ్. కంటెంట్, పెట్టుబడులపై కార్యక్రమాలు, ప్రపంచంలో భారత దేశ వాణిజ్య మరియు విధానాలను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ మీడియా హౌజ్ నుంచి వెలువడే ఇండియా గ్లోబల్ బిజినెస్ మ్యాగజైన్‌ను ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది పారిశ్రామికవేత్తలు చదువుతారు. దీనికి అదనంగా India Inc పలు సమావేశాలను సైతం నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు యూకే ఇండియా లీడర్షిప్ కాన్‌క్లేవ్, యూకే ఇండియా అవార్డ్స్, గో గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం లాంటి సదస్సులన నిర్వహించింది.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com