ఆన్‌లైన్‌లోనే రస్‌ అల్‌ ఖైమా డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యువల్‌

- June 18, 2018 , by Maagulf
ఆన్‌లైన్‌లోనే రస్‌ అల్‌ ఖైమా డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యువల్‌

రస్‌ అల్‌ ఖైమా డ్రైవింగ్‌ లైసెన్సులు వ్చే వారం నుంచి మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే రెన్యువల్‌ చేసుకోవాల్సి వుంటుంది. జూన్‌ 24 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ - లైసెన్సింగ్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. ప్రస్తుతం ఐదు సెంటర్స్‌తో సంయుక్తంగా సైట్‌ టెస్ట్స్‌ నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీని సంప్రదించాల్సిన అవసరం లేకుండానే జబెర్‌ ఆప్టికల్‌, రస్‌ అల్‌ ఖైమా హాస్పిటల్‌, ఇంటర్నేషనల్‌ స్పెషలైజ్డ్‌ సెంటర్‌, సమీర్‌ ఆప్టిక్స్‌ సెంటర్స్‌, బెల్హాసా డ్రైవర్స్‌ వద్ద ఈ పరీక్షలు జరుగుతాయి. వృద్ధులు, వివకాలుంగులకు కొత్త రూల్‌ నుంచి మినహాయింపునిచ్చారు. వినియోగదారుల విలువైన సమయం వృధా కాకుండానే ఈ ఆన్‌లైన్‌ విధానం తెచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త విధానానికి సంబంధించి బ్రోచర్లు అరబిక్‌, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో అందుబాటులో వుంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com